మీ పిల్లలు తరచుగా మూత్రానికి వెళ్తున్నారా? వారికున్న సమస్య ఇదే..
కొంతమంది పిల్లలు సాధారణం కంటే ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తూనే ఉంటారు. కానీ ఇది మంచిది కాదు. ఇలా పిల్లలు తరచుగా మూత్రానికి ఎందుకు వెళ్తారో తెలుసా?
పిల్లల విషయంలో ప్రతి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారి హెల్త్ విషయంలో. చాలా మంది పిల్లలు తరచుగా మూత్రానికి వెళ్తూనే ఉంటారు. తల్లిదండ్రులకు ఈ విషయం కూడా తెలుసు. కానీ ఇది నార్మలే అని లైట్ తీసుకుంటారు. కానీ పిల్లలు తరచుగా మూత్రవిసర్జన చేస్తుంటే ఖచ్చితంగా హాస్పటల్ కు తీసుకెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పిల్లలు నీళ్లను ఎక్కువ తాగకపోయినా మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే ఇది 2 నుంచి 8 సంవత్సరాల వయస్సున్న పెరుగుతున్న పిల్లల్లో ఒక సాధారణ సమస్య. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇది తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అధిక మూత్రాశయం
అతి చురుకూనా మూత్రాశయం వల్ల కూడా పిల్లలు తరచుగా మూత్రవిసర్జన చేస్తారు. ఇదొక మూత్ర అనియంత్రిత వ్యాధి. మీ పిల్లలు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటే వెంటనే డాక్టర్ కు చూపించడం మందిది.
పాలియూరియా
పాలియూరియా బారిన ఎక్కువగా 3 నుంచి 8 ఏండ్ల లోపున్న పిల్లలు ఎక్కువగా పడుతుంటారు. వీళ్లు రోజుకు ఏకంగా 10 నుంచి 30 సార్లు మూత్ర విసర్జన చేస్తుంటారు. అయితే డాక్టర్లు దీన్ని ఒక మానసిక సమస్యగా పేర్కొంటున్నారు. ఈ సమస్య ఉన్న పిల్లలు మూత్ర విసర్జన బాగా ఎక్కువగా చేస్తారు. అలాగే వీరికి మూత్రవిసర్జన సమయంలో విపరీతమైన నొప్పి కూడా వస్తుంది. అయితే ఇది అంటువ్యాధి కూడా అని డాక్టర్లు చెబుతున్నారు.
Nocturia:
మీ పిల్లవాడు ప్రతి రాత్రిపూట ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తే దానిని నోక్టురియా అని పిలుస్తారు డాక్టర్లు. కొంతమంది పిల్లలు పెద్దయ్యాక కూడా మంచం మీద మూత్ర విసర్జన చేస్తుంటారు. దానికి కారణం ఈ వ్యాధేనంటారు డాక్టర్లు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట, నీళ్లను ఎక్కువగా తాగడం, తరచూ జ్వరం, కడుపు నొప్పి, అకస్మాత్తుగా బరువు తగ్గడం పిల్లల్లో కనిపించే సాధారణ లక్షణాలు ఇవి.
కారణమేంటి?
మూత్రాన్ని ఆపడం, స్పైసీ డైట్ తినడం, సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పండ్లను తినడం వంటివి ఈ ఆరోగ్య సమస్యకు కొన్ని కారణాలు. ఈ సమస్య నిర్దారణ అయితే శరీరంలోని మూత్ర మార్గంలో బ్యాక్టీరియా ఉనికిని వైద్యులు చెక్ చేస్తారు. ఇందుకోసం మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు చేస్తారు.
ఏదేమైనా మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం వారు ఉపయోగించే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలి. టాయిలెట్ కు వెళ్లిన తర్వాత శుభ్రమైన నీటితో కడుక్కోవాలి. మూత్రాన్ని ఆపడం మానుకోవాలి. ఇలా చేస్తే మీ పిల్లల్ని వెంటనే హాస్పటల్ కు చూపించండి.