పరుగు పందెంలో..9నెలల నిండు గర్భిణి
ఆమె పరుగు సాధారణ వ్యక్తిలాగే సాగింది. 9-10 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి. కానీ సగం సమయంలోనే ఆ పరుగును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
గర్భిణీ స్త్రీలు నెలలు నిండుతున్న కొద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే.. కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు కొద్దిపాటి వ్యాయామాలు చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే.. ఓ మహిళ మాత్రం ఏకంగా 9నెలల నిండు గర్భంతో పరుగు పందెంలో పాల్గొంది.
నిండు గర్భంతో ఒకావిడ 1.6 కిలోమీటర్ల పరుగుపందెంలో పాల్గొని అందరినీ ఆశ్యర్యపరిచింది. 28 ఏళ్ల అథ్లెట్ మాకెన్నా మైలర్ అనే మహిళ అక్టోబర్ 19న ఈ ఘనత సాధించింది.
ఆమె పరుగు సాధారణ వ్యక్తిలాగే సాగింది. 9-10 నిమిషాల్లో 1.6 కిలోమీటర్ల పరుగును పూర్తి చేయాలి. కానీ సగం సమయంలోనే ఆ పరుగును పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
‘‘ఇంతటి గర్భంతో నేను ఈ పరుగును పూర్తి చేస్తానని అనుకోలేదు. వారం వారం పాటించాల్సిన అన్ని ఆరోగ్య నియమాలను తప్పడం లేదు. తొమ్మిది నెలల గర్భంలో ఈ పరుగు పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉంది. మొదట ‘నేనెందుకు చేయలేను?’ అనే ప్రశ్న వేసుకున్నాను. పూర్తి చేయాలనే అనుకుని మనసును ఆహ్లపరుచుకున్నాకే పరుగు ప్రారంభించాను’’ అని మాకెన్న తెలిపారు.