Asianet News TeluguAsianet News Telugu

మమ్మీ ఇష్టమే. కాని డాడీ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. పిల్లలు చెప్పే 8 కారణాలివిగో

మీ ఫ్యామిలీలో పిల్లలు ఎక్కువ ఎవరితో ఎటాచ్ మెంట్ గా ఉంటారు? మమ్మీతోనా? డాడీతోనా? ఈ క్వశ్చన్ కి ఇప్పటికే మీకు ఆన్సర్ వచ్చేసి ఉంటుంది కదా? నిజమే. జనరేషన్ ఛేంజ్ వల్ల ఈ కాలంలో పిల్లలు ఎక్కువగా తండ్రితోనే క్లోజ్ గా ఉంటున్నారు. 1980, 1990 కిడ్స్ మాత్రం కచ్చితంగా అమ్మతోనే ఫ్రీగా ఉంటారు. అమ్మతో ఉండే చనువు వేరుగా ఉంటుంది. ఆ క్లోజ్ నెస్ మళ్లీ ఇంకెక్కడా చూపించలేం కదా? అదే నాన్నతో అయితే అన్ని కంఫర్ట్స్ అక్కడే దొరుకుతాయి. ఈ జనరేషన్ పిల్లలు డాడీతోనే ఎక్కువ క్లోజ్ గా ఉండటానికి, వారితోనే ఎక్కువ టైమ్ గడపడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. 

8 Reasons Why Kids Prefer Their Dad Over Mom sns
Author
First Published Oct 2, 2024, 1:07 PM IST | Last Updated Oct 2, 2024, 1:07 PM IST

నాన్న ప్రోత్సాహం సూపర్

ఇంతకు ముందు జనరేషన్ తండ్రులు కుటుంబాలను పోషించడమే తమ మెయిన్ పర్పస్ అని భావించేవారు. సంపాదించడం, కుటుంబసభ్యుల అవసరాలు తీర్చడమే పనిగా ఉండేవారు. ఇక వేరే అటాచ్ మెంట్స్ పెద్దగా ఉండేవి కాదు. కాని ఈ తరం తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లల లక్ష్యాలను తెలుసుకొని వాటిని నెరవేర్చడానికి కష్టపడుతుంటారు. ముఖ్యంగా తండ్రులు పిల్లలకు అన్ని విషయాలను ఓపిగ్గా చెబుతుంటారు. వారి లక్ష్య సాధనలో తోడుగా ఉంటున్నారు. ఆర్థికంగా, మానసికంగా పిల్లలకు కావాల్సిన ప్రోత్సాహం, ఆదరణ ఇస్తున్నారు. వారి విజయాలను అభినందిస్తున్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు.

8 Reasons Why Kids Prefer Their Dad Over Mom sns

నాన్న దగ్గరుంటే చాలా ధైర్యం

ఈ కాలం తండ్రులు మాక్సిమం చదువుకున్న వారై ఉంటున్నారు. అంటే వారికి ప్రపంచ విషయాలపై అవగహన ఉంటోంది. అందువల్ల తమ పిల్లల ప్రేమను పొందడానికి ఏం చేయాలో ఈ కాలం తండ్రులకు బాగా తెలుసు. అందుకే ఫాదర్స్ పిల్లలతో చాలా సరదాగా ఉంటారు. పిల్లలకు కాన్ఫిడెన్స్ ఎలా పెంచుకోవాలో నేర్పిస్తారు. ఏదైనా ఒక పని పూర్తి చేయాలంటే ఎలా ముందుకెళ్లాలి. ప్లానింగ్ ఏమిటి. ఇలా అనేక రకాలుగా పిల్లలకు తండ్రులు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇది భవిష్యత్తులో పిల్లలు వారి సొంత నిర్ణయాలపై స్ట్రాంగ్ గా నిలవడానికి సహాయపడుతుంది.

నాన్నతోనే ఆటలు, పాటలు

మదర్స్ పిల్లలకు ఆరోగ్యకరమైన ఫుడ్ వండేందుకు కిచెన్ లో ఉండిపోతుండటంతో పిల్లలు ఫాదర్స్ తోనే అన్ని పనులు చేయించుకుంటున్నారు. ఇది వారి మధ్య బాండింగ్ పెరగడానికి సహాయపడుతోంది. ఈ క్రమంలోనే ఆటలైన, పాటలైన తండ్రులతో పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఫాదర్ అయితే పిల్లలతో ఆటలు ఆడతారు. హోం వర్స్క్ కూడా చేయిస్తారు. పిల్లలతో మూవీస్ చూడటం, జోక్స్ షేర్ చేసుకోవడం ఇలాంటి పనులు చేస్తుండటంతో డాడీకి పిల్లలకు మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతోంది. 

ఫాదర్ సూపర్ హీరో

చాలా మంది పిల్లలు తమ ఫాదర్ సూపర్ హీరో అని అనుకుంటారు. పేరెంటింగ్ పై మంచి అవగాహన ఉన్న వాళ్లు పిల్లలను మంచి ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తారు. వారిలో ఎంటర్ టైన్ మెంట్ విషయాలు, మంచి అలవాట్లు షేర్ చేసుకుంటారు. చాలా మంది పెద్దలు చిన్నతనంలో వారు పడిన ఇబ్బందులు తమ పిల్లలు పడకూడదని అనుకుంటారు. ఈ క్రమంలో వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. పిల్లలు అడిగిన ప్రతి పని ఫాదర్ చేసి చూపించడంతో తండ్రి సూపర్ హీరో అని భావిస్తారు. అలాంటి అడ్వన్చర్ పనులు తాము కూడా చేయాలని పిల్లలు ఆలోచిస్తారు. 

నాన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసేస్తాడు

ఈ తరం తండ్రులు ఉద్యోగం, వ్యాపారంతో పాటు పిల్లల ఎదుగుదలలోనూ మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. హోంవర్క్స్ లో హెల్ప్ చేస్తారు. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ స్వాల్వ్ చేసి ఇస్తారు. దీనికి కారణం పిల్లలపై వారికి ఎక్కువ ప్రేమ ఉండటం. తండ్రులు పడే కష్టం చూసిన పిల్లలు తమ ఫాదర్ ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేసేస్తాడు అని అనుకుంటారు. ఇది చాలా సందర్భాల్లో బయట పెడతారు కూడా. అందువల్ల ఆ పేరు నిలబెట్టుకోవడం కోసం తండ్రులు నిరంతరం కష్టపడుతుంటారు. పిల్లలకు ఎప్పుడూ సూపర్ హీరోగానే ఉంటారు. 

8 Reasons Why Kids Prefer Their Dad Over Mom sns

డాడీయే రోల్ మోడల్

పాత తరంతో పోల్చితే ఈ తరం తండ్రులకు కాస్త సహనం, ఓపిక ఎక్కువనే చెప్పాలి. వారి ఆలోచనా విధానం కూడా చాలా సింపుల్ గా, కూల్ గా ఉంటోంది. ఇది పిల్లలకు చాలా నచ్చుతుంది. దీంతో వారు కూడా తమ ఫాదర్ లా ఉండాలని, పనులు చేయడం, ఆలోచించడం వంటి అలవాట్లు చేసుకుంటారు. జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారు. తండ్రులు పిల్లల విషయంలో చాలా నిజాయతీగా ఉంటారు. ఇది పిల్లలకు చెప్పకుండానే అర్థమవుతుంది. అందుకే డాడీ పిల్లలకు రోల్ మోడల్. 

డాడీ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్

ఈ కాలం తండ్రులు పిల్లలను ఎక్కువగా నవ్విస్తారు. వారిని హ్యాపీగా ఉంచడానికి కొత్త కొత్త పనులు, ఆలోచనలు చేస్తారు. వారు పిల్లల జీవితంలో సరదా వాతావరణాన్ని కల్పిస్తారు. ఇది పిల్లలను తండ్రులకు మరింత దగ్గర చేస్తుంది.  అదే విధంగా పిల్లలకు ఫ్రీడం కూడా అలాగే ఇస్తారు. ఆలోచించి పనులు చేసుకునే స్వేచ్ఛను ఇస్తారు. ఏదైనా కొత్త విషయాలు, కోర్సులు, సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ప్రోత్సాహం ఇస్తారు. ఈ స్వాతంత్ర్యం వల్ల పిల్లలు జీవితంలో స్ట్రాంగ్ గా ఉండేలా ఎదుగుతారు.

డిసిప్లేన్ కూడా నాన్నే నేర్పిస్తారు

ఎప్పుడూ ఆటలు, పాటలు, ఎంటర్‌టైన్‌మెంటేనా? డాడీలో సీరియస్ కూడా ఉంటుంది. తప్పు చేస్తే అదే రేంజ్ లో వార్నింగ్స్ కూడా ఉంటాయి. అవేలా అంటే కొట్టకుండానే నొప్పి భరించలేనంత కఠినంగా డాడీ మాటలు గుచ్చుకుంటాయి. ఇలాంటి ఒకటి, రెండు సందర్భాలు ఎదురైతే పిల్లల్లో క్రమశిక్షణ చెప్పకుండానే అలవాటుగా మారిపోతుంది. ఈ కారణాలతో ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబంలో పిల్లలు తండ్రులనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios