Asianet News TeluguAsianet News Telugu

పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో వీటిని పెడితే ఆరోగ్యంగా ఉంటారు..

పిల్లలు టేస్టీగా ఉండే ఆహారాలనే ఎక్కువగా తింటారు. లేదంటే మొత్తమే తినరు. అయితే పిల్లలకు పెట్టే ఫుడ్ ఒక్కరుచికరంగా ఉంటే సరిపోదు. హెల్తీగా కూడా ఉండాలి. వారికి ఉదయం ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ ను పెట్టాలో తెలుసా? 

5 Indian Breakfast Ideas for Children
Author
First Published Feb 20, 2023, 9:52 AM IST

పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా.. చాలా రోజుల వరకు తగ్గదు. అందుకే పిల్లలకు పెట్టే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారిని ఆరోగ్యంగా ఉంచే ఆహారాలనే పెట్టాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలకు ఉదయం పూట కొన్ని రకాల ఆహారాలను పెడితే వారు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు అవి రుచిగా ఉండటంతో పిల్లలు ఎలాంటి మారం చేయకుండా తింటారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఓట్స్

ఓట్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి.  ఓట్స్ ను తింటే ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలొచ్చే ప్రమాదమే ఉండదు. అంతేకాదు ఇది మీ పిల్లల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే మీ పిల్లలకు ఉదయం పూ ఓట్స్ ను తప్పకుండా పెట్టండి. ఓట్స్ లో అరటిపండ్లు, చెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి మీ పిల్లలకి ఇష్టమైన పండ్లను లేదా బాదం, పిస్తా, కొంచెం కోకో పౌడర్, తేనెను వేసి టేస్టీ రిసిపీని తయారుచేసి పెట్టండి. ఓట్స్ తో ఓట్స్ దోశ లేదా ఇడ్లీ లేదా ఉప్మా వంటి డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలను ట్రై చేయొచ్చు. 

గుడ్డు ఆధారిత బ్రేక్ ఫాస్ట్

గుడ్లు  పోషకాల బాంఢాగారం. గుడ్డును ఉదయం పూట తినడం వల్ల మీ పిల్లలు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. గుడ్లలో ఉండే ప్రోటీన్లు పిల్లలలో కండరాలు, కణజాలాల పెరుగుదలకు ఎంతో హాయపడతాయి.  స్క్రాంబ్లింగ్, ఆమ్లెట్, ఉడకబెట్టిన గుడ్డు, గుడ్డు శాండ్విచ్  అంటూ గుడ్డును మీ పిల్లలకు ఎన్నో రకాలుగా ఇవ్వొచ్చు. 

ఆకుకూరలు

ఆకు కూరల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి ఎన్నో రోగాలను దూరం చేస్తాయి. అందుకే మీ పిల్లలకు నచ్చిన బచ్చలికూర, క్యాబేజీ లేదా క్యాప్సికమ్ వంటి కొన్ని ఆకుపచ్చ కూరగాయలను వేయించి, టోస్ట్ తో కలపండి. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పెట్టండి. అయితే కూరగాయలను అతిగా వండకూడదు. ఎందుకంటే కూరగాయలను ఎక్కువగా వేడి చేస్తే దీనిలో ఉండే పోషకాలు తగ్గుతాయి. 

సీజనల్ ఫ్రూట్స్

చలికాలం వచ్చిందంటే చాలు పిల్లలు పండ్లను తక్కువగా తింటారు. కానీ ఇది విటమిన్ లోపానికి దారితీస్తుంది. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి పిలల్లో పోషక లోపాలను పోగొడుతాయి. అంతేకాదు వారి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతాయి. అందుకే నారింజ, బెర్రీలు, దానిమ్మ పండ్ల పండ్లను పెట్టండి. ఈ పండ్లు విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లకు మంచి వనరులు. ఇవి పిల్లల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఉసిరికాయ శరీర యాంటీఆక్సిడెంట్ స్థాయిలను పెంచుతుంది. విటమిన్ సి కి ఇది అద్భుతమైన మూలం.

ఉప్మా

ఉప్మాను చూస్తేనే మొహాన్ని అదోరకంగా పెట్టేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉప్మాను తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. పనిచేసే మహిళలు తమ పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ దీన్ని త్వరగా చేసి పెట్టొచ్చు. ఉప్మాలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, జింక్, భాస్వరం, ఇనుము, పిండి పదార్థాలు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. ఉప్మాలోని పోషకాలు మూత్రపిండాలు, గుండె, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.  రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. బఠాణీలు, క్యారెట్లు, బీన్స్ వంటి కూరగాయలను ఉప్మాలో వేయొచ్చు. ఇవి ఉప్మాలో పోషకాలను పెంచుతాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios