Asianet News TeluguAsianet News Telugu

కోనేరు హంపీ విజయకేతనం... రెండోసారి కెయిన్స్ కప్ కైవసం

ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ జూ వెంజున్‌ అయిదున్న‌ర పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో నిలిచారు. ఇక ర‌ష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టానిక్ 5 పాయింట్లతో మూడ‌వ స్థానంలో ఉన్నారు.

Humpy Koneru wins second edition of the Cairns Cup
Author
Hyderabad, First Published Feb 18, 2020, 8:33 AM IST

ఇండియన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీ మరోసారి సత్తా చాటింది. అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ చెస్ టోర్నమెంట్ ను హంపీ గెలుపొందారు. తొమ్మిది రౌండ్ల టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి టైటిల్‌ను సాధించారు. మరో రౌండ్‌ మిగిలి ఉండగానే ఆమె విజయం సాధించారు. కెయిన్స్ క‌ప్‌ను నిర్వ‌హించ‌డం ఇది రెండోసారి. ఇంట‌ర్నేష‌న్ చెస్ స‌మాఖ్య ఆధ్వ‌ర్యంలో ఈ టోర్నీ జ‌రిగింది.

ద్రోణవల్లి హారికతో జరిగిన చివరి రౌండ్‌ డ్రాగా చేసుకున్న కోనేరు హంపి టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్ర‌స్తుత వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ జూ వెంజున్‌ అయిదున్న‌ర పాయింట్ల‌తో రెండ‌వ స్థానంలో నిలిచారు. ఇక ర‌ష్యాకు చెందిన అలెగ్జాండ్రా కోస్టానిక్ 5 పాయింట్లతో మూడ‌వ స్థానంలో ఉన్నారు. కోస్టెనిక్ నాలుగో స్థానంలో, హరిక 4.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. కెయిన్స్ క‌ప్ విజేత హంపికి టోర్నీ నిర్వాహ‌కులు 45 వేల డాల‌ర్ల ప్రైజ్‌మ‌నీ, ట్రోఫీని ఆమెకు బ‌హూక‌రిస్తారు.

Also Read ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌‌గా కోనేరు హంపి...

గ‌త ఏడాది మ‌హిళ‌ల రాపిడ్ చెస్ చాంపియ‌న్‌షిప్‌ను గ్రాండ్‌మాస్ట‌ర్ కోనేరు హంపి గెలుచుకున్న‌ విషయం తెలిసిందే. మొత్తం 12 రౌండ్లుగా జరిగిన రాపిడ్ చాంపియ‌న్‌షిప్‌లో హంపీ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని చాంపియన్‌గా అవతరించారు.

 ఈ విజయం పట్ల హంపీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ టైటిల్ సాధించడానికి తాను ఎంతలా కృషి చేశాననే విషయాన్ని వివరించారు. పెళ్లై.. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మేరీకోమ్, సెరెనాలు ఎలా క్రీడల్లో రాణించారో.. తాను కూడా అలానే రాణించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందుకోసం తాను ప్రాణాళికలు వేసుకున్నట్లు చెప్పారు. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత చెస్ ఆడాలని నిర్ణయించుకోనున్నట్లు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios