విజయవాడ టీడీపీలో చల్లారని విభేదాలు: చంద్రబాబుకు తలబొప్పి
విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా కేశినేని నానిని చంద్రబాబు నియమించడంతో బుద్ధా వెంకన్న వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది.
విజయవాడ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో విభేదాలు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారాయి. చాలా కాలంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి, పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్నకు మధ్య విభేదాలు గుప్పుమంటూనే ఉన్నాయి. విజయవాడ కార్పోరేషన్ ఎన్నకల సమయంలో ఎగిసిపడిన విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. Kesineni Nani వెంకన్న, నాగుల్ మీరా తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాను చేతులెత్తిస్తున్నట్లు కూడా ఓ సందర్భంలో కేశినేని చంద్రబాబుకు చేప్పారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన Chandrababuకు గతంలో ఓ లేఖ రాశారు. అయితే, చంద్రబాబు ఆయనను బుజ్గగించారు. తన కార్యాలయం వద్ద టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలను కూడా ఓ సందర్భంలో తీసేశారు. అయితే, ఆ తర్వాత ఓ సందర్బంలో కేశినేని నాని చంద్రబాబును కలిశారు. అక్టోబర్ లో చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షకు కేశినేని నాని సంఘీభావం ప్రకటించి ఆ దీక్షలో పాలు పంచుకున్నారు. దీంతో కేశినేని అలక వీడినట్లు భావించారు. అందుకు అనుగుణంగా కేశినేని నాని పట్ల చంద్రబాబు సానుకూలంగా వ్యవహరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా చంద్రబాబు కేశినేని నానిని నియమించారు. దీంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి.
Also Read: నిన్నటి వరకు రుసరుసలు.. నేడు చంద్రబాబు దీక్షకు మద్ధతు, కేశినేని నాని అలక వీడారా.. ?
ఉత్తరాంధ్ర జిల్లాల TDP కార్యకలాపాల బాధ్యతలను అప్పగించినప్పటికీ బుద్ధా వెంకన్న సంతృప్తి చెందినట్లు లేరు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా చంద్రబాబు కేశినేని నానిని నియమించడమే కాకుండా Budha Venkanna, నాగుల్ మీరా వేసిన కమిటీలను రద్దు చేశారు. ఆ నియోజకవర్గం కమిటీలను వేసుకునేందుకు కేశినేని నానికి చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. దీంతో బుద్ధా వెంకన్న మరింతగా అసంతృప్తికి లోనైనట్లు కనిపిస్తున్నారు.
తాజాగా, కేశినేని నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు కొంత మంది రోడ్డుకు ఎక్కి నినాదాలు కూడా చేశారు. కేశినేని నానికి వ్యతిరేకంగా బుద్ధ వెంకన్న వర్గం తీవ్రంగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోంది. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఈ విభేదాల కారణంగానే ఘోరంగా దెబ్బ తిన్నట్లు భావిస్తున్నారు.
Also Read: విజయవాడలో బాబు ఎన్నికల ప్రచారం: కేశినేని నాని దూరం
విజయవాడ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని తన కూతురు శ్వేతను ప్రకటించడాన్ని అప్పట్లో బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావు, బుద్ధ వెంకన్న తీవ్రంగా వ్యతిరేకించారు. కేశినేని నానికి వ్యతిరేకంగా వారు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. సామాజిక వర్గం పేరుతో వారు ఆయన విరుచుకుపడ్డారు. అయితే, చంద్రబాబు జోక్యం చేసుకుని కొన్ని సర్దుబాట్లు చేయడంతో గొడవ సద్ధుమణింగింది. అయితే, ఆ తర్వాత కూడా విభేదాలు ఏ మాత్రం రూపుమాసిపోలేదు. తాజాగా కేశినేని నానికి చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడం బుద్ధా వెంకన్న వర్గానికి రుచించడం లేదు. మొత్తంగా వ్యవహారం చంద్రబాబుకు తలబొప్పి కట్టించే స్థాయికి చేరుకుంది.