టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు మద్ధతుగా ఆ పార్టీ నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కాసేపట్లో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని కూడా చంద్రబాబు నిరసన దీక్షలో పాల్గొననున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారని కేశినేని నానిపై ప్రచారం జరుగుతోంది.


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల దీక్షకు మద్ధతుగా ఆ పార్టీ నేతలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. కాసేపట్లో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని కూడా చంద్రబాబు నిరసన దీక్షలో పాల్గొననున్నారు. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారని కేశినేని నానిపై ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమయంలో ఎంపీ నాని టీడీపీ ఆఫీసుకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాగా.. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు నాయుడిపై కేశినేని నాని తన వ్యతిరేకతను కేశినేని శ్రీనివాస్ (కేశినేని నాని) బహిరంగంగానే ప్రదర్శించారు. విజయవాడలోని తన కార్యాలంయ వెలుపల గోడకు అమర్చిన చంద్రబాబు చిత్రపటాన్ని ఆయన తోలగించారు. Chandrababu చిత్రం పటం స్థానంలో తాను రతన్ టాటాతో (ratan tata) కలిసి ఉన్న ఫొటోను అమర్చుకున్నారు కేశినేని భవన్ (kesineni bhavan) బయట ఏర్పాటు చేసిన తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీల ఫోటోలను, ఇతర ముఖ్య నాయకుల ఫోటోను కూడా తొలగించారు. ఆ ఫొటోల స్థానంలో టాటా ట్రస్టు, (tata trust) తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధికి సంబంధించిన వివరాలతో ఉన్న ఫొటోలను పెట్టుకున్నారు. ఈ స్థితిలో కేశినేని నాని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు భావిస్తున్నారు. కేశినేని బిజెపిలో (bjp) చేరుతారా అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది.

ALso Read:చంద్రబాబుపై మరో పిడుగు: పాత గొడవను పైకి తెచ్చిన కేశినేని నాని

అయితే, తాను గానీ, తన కూతురు గానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని Kesineni nani చంద్రబాబుకు చెప్పారు. అయితే తాను టీడీపీలోనే ఉంటానని ఆయన చెప్పారు. బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్నలతో తలెత్తిన విభేదాల నేపథ్యంలో కేశినేని నాని ఆ నీర్ణయం తీసుకున్నట్లు భావించారు. విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో ఆ నాయకులు కేశినేని నానిపై బహిరంగంగానే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఆ సమయంలో తలెత్తిన వివాదం విషయంలో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావులపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా నిరసిస్తూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పినట్లు సమాచారం. అయితే, తన అసంతృప్తిని తీవ్రంగా వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు చర్యలు తీసుకోకపోవడంతో ఆయన తాజాగా తన కార్యాలయం వెలుపల గోడకు ఉన్న చంద్రబాబు చిత్రపటాన్ని తొలగించినట్లు భావిస్తున్నారు. ఇక టీడీపీలో ఉండలేననే స్థిర నిర్ణయానికి కేశినేని నాని వచ్చినట్లు భావిస్తున్నారు.