అతిక్, ఇతర నేరస్థులను మాత్రమే ముస్లిం నాయకులుగా పిలవడం ఆపండి.. ఎందుకు ఈ ధోరణి ముందుకు వస్తోంది..?
Hyderabad: ఒక కేసు నిమిత్తం అతిక్ అహ్మాద్‌ను ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ కు తీసుకువచ్చారు. గతంలో ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా కొనసాగారు. 2019 నుంచి సబర్మతి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, భారత్ లో కొంత కాలంగా ఒక విచిత్రమైన ధోరణి కనబడుతున్నదని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.. !
Politics of India-muslim: మాఫియా డాన్, పలు హత్య కేసుల్లో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతిక్ అహ్మద్ ను విచారణ కోసం అహ్మదాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కు తీసుకువచ్చారు. అయితే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అతిక్ కు అనుకూలంగా మాట్లాడటం ద్వారా ముస్లింలను ఆకట్టుకోవచ్చని కొందరు రాజకీయ మేధావుల వాదనలు దీని వెనుక ఉన్నాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో మనం గమనించాల్సిన కొన్ని ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.. అసలు ఎవరీ అతిక్ అహ్మద్..? ఏం తెలుసు మనకు ఆయన గురించి..? భారత్ లో హంతకులు, రేపిస్టుల జాబితాలో ఒక వర్గం ఉంటుందా? అఖిలేష్ యాదవ్ వంటి ప్రముఖ రాజకీయ నాయకులు ఆయనకు మద్దతుగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక కమ్యూనిటీగా ముస్లింలకు అతిక్ లాంటి వారి పట్ల సానుభూతి ఉందని మనం ఎందుకు నమ్ముతున్నాం? ఇలా పలు ప్రశ్నలు దానికి సమాధానాలు వెతకాల్సిన సమయమిదని గుర్తించాలి. ఎందుకంటే..?
లౌకికవాదం పేరుతో ముస్లిం సమాజాన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా హైజాక్ చేశాయనేది వాస్తావం. ఒకవైపు మెజారిటీ వర్గాల నుంచి ముప్పు పొంచి ఉందని భావిస్తూనే మరోవైపు ముస్లిం మాఫియా డాన్లను హిందువులకు వ్యతిరేకంగా తమ రక్షకులుగా చూపిస్తూ వారిని క్యాప్టివ్ ఓటు బ్యాంకులుగా పరిగణిస్తున్నారు. వివిధ సంఘటనలు, టీవీ స్టూడియో చర్చల మీడియా కవరేజ్ కూడా ముస్లింలు నేరస్థులను తమ నాయకులుగా అనుసరిస్తారనే అభిప్రాయాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఒక విధంగా ఈ సమాజానికి చెడ్డ ఇమేజ్ సృష్టిస్తుంది. ఇలాంటి వాతావరణం హిందువులు-ముస్లింల మధ్య చీలికను పెంచుతుంది, జాతీయ ఐక్యతకు ముప్పు కలిగించడంతో పాటు ముస్లింలను వెనుకకు నెట్టివేస్తుందనే స్పష్టం.
క్రిమినల్స్ చట్టసభలకు, పార్లమెంటుకు ఎన్నికైన మాట వాస్తవం కాదా? అని ప్రజలు తరచుగా అడుగుతుంటారు. అయితే, ప్రతి సామాజిక వర్గానికి చెందిన క్రిమినల్స్ రాజకీయాల్లోకి వస్తారని, రాజకీయ అండదండలతోనే ప్రతి సామాజికవర్గం నుంచి ఓట్లు పొందుతారని అర్థం చేసుకోవాలి. హిందూ వర్గాలకు చెందిన క్రిమినల్స్ జాతీయ రాజకీయ పరిధిని ఆక్రమించనప్పటికీ, రాజకీయాల్లోకి ప్రవేశించే ముస్లిం క్రిమినల్స్ ను 'కమ్యూనిటీ లీడర్'గా పరిగణిస్తారు. అయితే, దీనికి భిన్నంగా అఖిలేష్ యాదవ్ ఎప్పుడూ ఆజంఖాన్ కు మద్దతుగా మాట్లాడలేదు కానీ అతిక్ అహ్మద్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆజంఖాన్ చాలా సీనియర్ నాయకుడు, బాగా చదువుకున్నవాడు, ఏఎంయూఎస్ యూ మాజీ అధ్యక్షుడు, యూనియన్ నాయకుడు.. వాస్తవానికి ఆయన నేరస్థుడు కాదు. అతనిపై హత్య, అత్యాచారం, హేయమైన నేరాల అభియోగాలు లేవు. అతిక్ ముస్లింల నాయకుడని, ఆయనపై ఎలాంటి చర్య తీసుకున్నా అది సమాజానికి జరిగిన అన్యాయంగానే పరిగణిస్తామని అఖిలేష్ పరోక్షంగా ప్రకటించారు.
ఈ హక్కు ఎవరు ఇచ్చారు?
మీడియా, రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు సృష్టించిన అవగాహనే ఈ సమస్య. ఒక ముస్లిం క్రిమినల్ ఎన్నికల్లో గెలిస్తే, అతను ఒక సామాజిక నాయకుడిగా చెప్పబడతాడు, కాని ముస్లిం మేధావి, సామాజిక కార్యకర్త లేదా ఆలోచనాపరుడు అనేక ఎన్నికలలో గెలిచిన తర్వాత కూడా మీడియా దృష్టిని పొందలేడు. క్రిమినల్ కాని ఈ నాయకులను రాజకీయ పార్టీలు ముస్లిం నాయకులుగా ప్రొజెక్ట్ చేయవు. తత్ఫలితంగా ముస్లింలలో నేరస్థులు మాత్రమే రాజకీయాల్లో విజయం సాధిస్తారని, వారిని కుల నాయకులుగా అంగీకరిస్తారని ముస్లింలలో అధిక భాగం నమ్ముతుంది. ఇలాంటి ధోరణి ఆందోళన కలిగించే అంశం.
సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ మనకు తెలుసు కానీ అదే పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ డాక్టర్ ఎస్ టీ హసన్ మనకు తెలుసా? మొరాదాబాద్ కు చెందిన సర్జన్ అయిన హసన్ మూడు దశాబ్దాలకు పైగా సామాజిక, రాజకీయ సేవలందించారు. గతంలో మొరాదాబాద్ మేయర్ గా పనిచేసిన ఆయన 2019లో బలమైన మోడీ వేవ్ కు వ్యతిరేకంగా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. సామాజిక కార్యకర్తగా ఆయనకున్న ప్రజా ఇమేజ్ కు ఈ విజయం నిదర్శనం.
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాకు చెందిన బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీని ఈ పార్టీలు, మీడియా ఎందుకు ప్రొజెక్ట్ చేయడం లేదు? బాగా చదువుకున్న ఆయన కొన్నేళ్లుగా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటున్నారు. 2019లో బీఎస్పీ అత్యల్ప స్థానంలో ఉన్నప్పుడు ఆయనకు ఉన్న మంచి ఇమేజ్ కారణంగా లోక్ సభ సీటును గెలుచుకున్నారు. కేవలం ముస్లిం ఓట్లతో లోక్ సభ ఎన్నికల్లో గెలవలేరనే సత్యాన్ని గుర్తుంచుకోవాలిక్కడ..!
బీహార్ లో అతిపెద్ద రాజకీయ పార్టీ టికెట్ పై గెలిచిన బీహార్ కు చెందిన షహబుద్దీన్ గురించి మనకు తెలుసు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కిషన్ గంజ్ నుండి బలహీనమైన భారత జాతీయ కాంగ్రెస్ టికెట్ పై గెలిచిన ముస్లిం నాయకుడిగా డాక్టర్ మొహమ్మద్ జావేద్ గురించి మనం ఎందుకు మాట్లాడకూడదు? గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంబీబీఎస్ డాక్టర్ అయిన ఆయన సామాజిక సేవలో చురుగ్గా ఉన్నారు. కానీ, ఆయన క్రిమినల్ కాదు కాబట్టి రాజకీయ పార్టీలు, మీడియా ఆయనను ముస్లిం నాయకుడిగా ప్రొజెక్ట్ చేయవు.
షహబుద్దీన్, ముక్తార్, అతిక్ మొదలైన వారిని తరచుగా ముస్లిం నాయకత్వ ముఖాలుగా చూపిస్తారు, కానీ ప్రొఫెసర్ జబీర్ హుస్సేన్ ను ముస్లిం నాయకుడిగా మనం మాట్లాడుతామా? ప్రొఫెసర్, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అయిన జబీర్ కర్పూరి.. ఠాకూర్ మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా, దాదాపు దశాబ్దం పాటు బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ గా, రాజ్యసభ ఎంపీగా, పలు ఇతర రాజకీయ పదవులు నిర్వహించారు.
మీడియాకు ప్రతిపక్షాల పట్ల పక్షపాతం ఉందని కొందరు వాదిస్తుంటారు. అదే నిజమైతే బీజేపీకి అనుబంధంగా ఉన్న ముస్లింలను ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులుగా హైలైట్ చేయాలి. అదే నిజమైతే బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ సయ్యద్ జాఫర్ ఇస్లాంను రాజకీయ చర్చల్లో ప్రముఖ వ్యక్తిగా చూడాలి. రాజకీయాల్లోకి రాకముందు జాఫర్ డాయిష్ బ్యాంక్ ఎండీగా పనిచేశారు. కానీ, మీడియా, 'సెక్యులర్' పార్టీలు ముస్లిం రాజకీయాల ముఖంగా కొంతమంది గ్యాంగ్ స్టర్లను చూపడంలో ముందుంటున్నాయి. తమలో నేరస్థులు మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నారని ముస్లింలు కూడా నమ్ముతారు, అది పూర్తిగా అబద్ధం అనేది గ్రహించాలి.
వాస్తవముందా..?
భారతదేశంలోని ఇతర పౌరుల మాదిరిగా ముస్లింలు గ్యాంగ్ స్టర్లను తమ నాయకులుగా పరిగణించలేరు. ఇతర సామాజిక వర్గాల మాదిరిగానే ముస్లింలలో సంఘ విద్రోహులు, క్రిమినల్స్ ఉన్నారు. వారిలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు, ఇది భారత రాజకీయాలు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్య. కానీ, ముస్లింలు నేరస్థులకు ఓటు వేస్తారని చెప్పడం అపోహ. ఒక ఎంపిక ఇచ్చినప్పుడు, ముస్లింలు మంచి వ్యక్తులకు ఓటు వేస్తారు అనేదానికి పై చెప్పుకున్నవారే ఉదాహరణ.. !
- సాకిబ్ సలీం