Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ విందుకు జగన్ కు నో, కేసీఆర్ కు ఎంట్రీ వెనుక కథ ఇదే....

మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రంప్ పర్యటనకు సంబంధించి వేరే విషయంపై చర్చ జరుగుతుంది. ట్రంప్ తో విందుకు తెలంగాణ ముఖ్యమంత్రిని కెసిఆర్ పాల్గొన్నారు కానీ.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం పాల్గొనలేదు. 

State dinner for trump: Kcr attends the event, jagan denied invitation... the reasons behind
Author
New Delhi, First Published Feb 26, 2020, 4:41 PM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ముగిసింది. అట్టహాసంగా నమస్తే ట్రంప్ వేడుకతో ఆరంభమైన పర్యటన నిన్న రాత్రి అధికారిక స్టేట్ డిన్నర్ తో ముగిసింది. భారత దేశం, అమెరికాల మధ్య పెరుగుతున్న మైత్రికి, ఈ పర్యటనను చిహ్నంగా చెప్పవచ్చు. 

ఇదంతా ఇలా ఉంటె... మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ట్రంప్ పర్యటనకు సంబంధించి వేరే విషయంపై చర్చ జరుగుతుంది. ట్రంప్ తో విందుకు తెలంగాణ ముఖ్యమంత్రిని కెసిఆర్ పాల్గొన్నారు కానీ.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం పాల్గొనలేదు. 

ఈ విషయం పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. కేవలం జగన్ మోహన్ రెడ్డికి ఒక్కడికే కాదు... చాలా మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందలేదు.

Also read: అమెరికా అధ్యక్షులు వచ్చిన ప్రతిసారి.... అప్పుడు కాశ్మీర్ ఇప్పుడు ఢిల్లీ

నిన్నటి విందులో కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప, అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మాత్రమే కనబడ్డారు. వీరిలో కూడా కేవలం కెసిఆర్ మాత్రమే బీజేపీయేతర ముఖ్యమంత్రి. 

ఈ నేపథ్యంలో అసలు ఈ అతిథుల ఎంపిక ఎలా జరిగిందనే దానిపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. లోక్ సభ ప్రతిపక్ష నేత అధిర్ రంజాన్ చౌదరి, రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబి ఆజాద్ లను మినహా వేరే ఏ కాంగ్రెస్ నేతను కూడా పిలవకపోవడం వల్ల ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ చాలా గుర్రుగానే ఉంది. దానిపై వారు ఓపెన్ గానే విమర్శలు చేసారు. 

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా ఆహ్వానించకపోవడం మరిన్ని విమర్శలకు దారి తీస్తుంది. ఢిల్లీలోని విద్య విధానాన్ని మెచ్చుకుంటూ అమెరికా ఫస్ట్ లేడీ అక్కడ దాదాపుగా గంట గడిపినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రికి మాత్రం ఆహ్వానం రాలేదు. ఆయన ఏదో మళ్ళీ తొలిసారి ముఖ్యమంత్రి అయినా వ్యక్తి కూడా కాదు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాడు. 

కొద్దిసేపు వీరందరి పేర్లను పక్కనుంచి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందలేదు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం అక్కడ ప్రత్యక్షమయ్యారు.

కెసిఆర్ కు ఆహ్వానం అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దొరికిందే సందుగా జగన్ మీద కేసులు ఉండబట్టి జగన్ ను విందుకు ఆహ్వానించలేదని ఆరోపించారు. 

Also read: ఇండియా పర్యటన: ఎన్నికల స్టంటే, తేల్చేసిన ట్రంప్!

ఈ ఆరోపణలను పక్కనపెట్టి అసలు జగన్ ను ఎందుకు ఆహ్వానించలేదు అనే విషయాన్నీ గనుక ఆలోచిస్తే... వాస్తవానికి ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ కన్నా జగన్ బీజేపీతో ఎక్కువ సన్నిహితంగా మెలుగుతున్నారు. కానీ జగన్ కి కాకుండా కెసిఆర్ కి ఆహ్వానం అందింది. 

లోతుగా గనుక చూస్తే... జగన్ కన్నా కెసిఆర్ సీనియర్. రెండు దఫాలు ముఖ్యమంత్రి. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ లో అనేక అమెరికా కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు కొలువై ఉన్నాయి. ఆపిల్ నుంచి గూగుల్ వరకు ఇలా అనేక కంపెనీలకు హైదరాబాద్ నెలవు. 

హైదరాబాద్ ఇప్పుడు ఒకరకంగా దేశానికే తలమానికం. సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో రికార్డులను తిరగరాస్తుంది. గ్లోబల్ ఎంట్రప్రెన్యూరల్ సమ్మిట్ కు వేదికగా నిలిచింది. అందుకోసమనే కెసిఆర్ కు ఆహ్వానం అంది ఉండాలి.

ఇక యడ్యూరప్పకు కూడా అందడానికి ఇదే కారణం కావొచ్చు. బెంగళూరు కూడా ఐటీ కి పెట్టిందిపేరుకాబట్టి అందుకోసమే కర్ణాటక ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం అంది ఉండొచ్చు. 

అంతే తప్ప ఏదో రాజకీయ కోణం దీని వెనుక దాగుందని, జగన్ కన్నా కెసిఆర్ అంటేనే కేంద్రానికి ఇష్టం వంటి విషయాలను చర్చించటం తగదు. ఎక్కువగా బీజేపీకి సంబంధించిన వ్యక్తులను మాత్రమే కేంద్రం పిలిచింది. 

అలాంటప్పుడు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, వాటికి కౌంటర్లిచ్చుకోవడం అనవసర విషయంగానే చెప్పవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios