రాష్ట్రాల పార్టీ నేతలతో సోనియా భేటీ: రేవంత్ కోరిక తీరేనా?
జవసత్వాలను కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి, అంతర్గత విభేదాలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో శివసేన బీజేపీల వైరం కొత్త ఊపిరులు ఊదింది. ఈ అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఉపయోగించుకునే దిశగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
జవసత్వాలను కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి, అంతర్గత విభేదాలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో శివసేన బీజేపీల వైరం కొత్త ఊపిరులు ఊదింది. ఈ అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఉపయోగించుకునే దిశగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
మహారాష్ట్ర లో కనీసం ప్రాంతీయ పార్టీలు శివసేన ఎన్సీపీలు తెచుకున్నన్ని సీట్లను కూడా దక్కించుకోవడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నింపాలని కాంగ్రెస్ అధినేత్రి భావిస్తున్నట్టు తెలియవస్తుంది. ఎట్లాగూ ఇప్పుడు అధికారం లభించబోతుంది కాబట్టి పార్టీని వీడేవారు ఎవ్వరూ ఉండరు.
ఇదే అదునైన సమయంగా సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు తీసుకోనున్నారు. 5 ఏళ్ల కిందట వరకు అధికారంలో ఉన్న పార్టీ నాలుగో స్థానానికి పడిపోవడం పై పోస్టుమార్టం జరుపుతున్నట్టు తెలుస్తుంది. అధికారాన్ని చేజిక్కించుకోకుండా బీజేపీని విజయవంతంగా పక్కకు బెట్టడంతో కార్యకర్తల్లో, నేతల్లో ఉత్సవాహం ఉరకలేస్తుంది. దీన్నే అదునుగా చేసుకొని కేవలం మహారాష్ట్రలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీలో సమూల మార్పులు చేపట్టనున్నట్టు సమాచారం.
Also read:అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్ పదవిపై జగ్గారెడ్డి కన్ను
వచ్చే ఐదేళ్ల లో యావత్తు దేశంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, తిరిగి అధికార పీఠం ఎక్కియ్యడానికి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కంకణం కట్టుకున్నట్టు తెలిసింది. అందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను, సీఎల్పీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ను రేపు 16వ తేదిన ఢిల్లీ కి రమ్మని కాంగ్రెస్ అధిష్టానం వర్తమానం పంపింది.
అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులను ఢిల్లీకి రమ్మనడం పార్టీ ప్రక్షాళన కోసమే అని తెలియవస్తుంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షులను నియమించి దాదాపుగా 6 సంవత్సరాలు కావొస్తుంది. ఉన్న కమిటీలను సమూలంగా ప్రక్షాళన చేసి, బాగా పాపులారిటీ ఉన్నవారిని, ప్రజల్లో బలమైన నాయకులుగా చలామణి అవుతున్నవారు, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేవారు, మరీ ముఖ్యంగా యువత ను అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ ఉన్న యువనేతలకు పగ్గాలను కట్టబెట్టాలని సోనియా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.
దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఏకంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీనే ప్రక్షాళన చేయాలని సోనియా గాంధీ త్లస్తున్నట్టు సమాచారం. అందుకే సోనియా గాంధీ ఈ మీటింగ్ కు నేతలను ఆహ్వానించారని సమూల ప్రక్షాళనే ధ్యేయంగా ఈ సమావేశం సాగబోతున్నట్టు పార్టీ నేతలు భావిస్తున్నారు.
బీజేపీ రెండోసారి అధికారాన్ని చేపట్టి ఆరు నెలలు కావొస్తుంది. దేశంలో ఆర్ధిక సంక్షోభం నెలకొని ఉన్న వేళ, నిరుద్యోగం విలయతాండవం చేస్తున్న సమయంలో పార్టీని బలపర్చడానికి, ప్రజలను ఆకర్షించడానికి ఇదే మంచి అదునుగా భావించిన అధినేత్రి ఆ ఆలోచనకు తగ్గట్టుగానే, మరో నాలుగున్నర ఏండ్లలో పార్టీని అధికారం లోకి తీసుకు రావడమే టార్గెట్ గా స్కెచ్ గీసినట్టు సమాచారం.
Also read:టీపీసీసీ చీఫ్: రేవంత్‌కు నో అంటున్న సీనియర్లు, పోటీ పడుతున్నది వీరే
అందులో భాగంగానే పార్టీలో ప్రక్షాళన చేసి పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరపాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా, పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృతనిశ్చయంతో పనిచేసే నేతలను మాత్రమే తీసుకోనున్నట్టు తెలుస్తుంది. పార్టీల్లోని అంతర్గత విభేదాలను పక్కనపెట్టి నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ ను కూడా మార్చడానికి సోనియా రెడీ అయినట్లు సమాచారం. గతంలో రేవంత్ ఢిల్లీ వెళ్లి సోనియాను కలిసినప్పుడే పీసీసీ పదవికి రేవంత్ కు కట్టబెడుతారన్న ప్రచారం జరిగినా, హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం. హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత వహిస్తూ పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వదులుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించేశాడు కూడా.
రేవంత్ తెలంగాణ పీసీసీ చీఫ్ రేసు లో అందరికంటే ముందున్నప్పటికీ ఆయనకు ఒక సమస్య అడ్డంకిగా మారింది. ఆయన టీడీపీ నుంచి వలస వచ్చిన కారణం గా, కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు ఈ పదవిని కట్టబెట్టుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇది అడ్డంకి అయితే రేవంత్ కు కలిసివచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.
ప్రజాదరణ, మాస్ ఫాలోయింగ్, డైనమిజం, మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ కేసీఆర్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వగలిగిన, నేరుగా ఢీకొట్టే నేత కావడం తో సీనియర్ల వాదనను కూడా తోసివేస్తూ, కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పేందుకు సోనియా భావిస్తున్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నారు.
ఇలా మార్పుల వల్ల నేతలెవరైనా అసంతృప్తి చెందితే, అటువంటి నేతలకు వేరే కీలక పదవులు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. పార్టీలో అంతర్గత విభేదాలు పార్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి కాబట్టి వాటిని పక్కకు పెట్టాల్సిందేనని పార్టీ నేతలకు సోనియా సీరియస్ వార్నింగ్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.
పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే నేతలు ఎవరైనా సరే వారికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలని సోనియా సిద్ధపడ్డట్టు సమాచారం. ఈ అన్ని సమీకరణలను పరిగణలోకి తీసుకుంటే, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు అప్పగించే అవకాశాలు మాత్రం ఒకింత మెరుగ్గానే కనపడుతున్నాయి.