బీహార్ ఎన్నికల్లోకి కొత్త క్యారెక్టర్.... నితీష్ కి షాకిస్తున్న లండన్ రిటర్న్?
సోమవారం నాడు బీహార్ లోని అన్ని ప్రముఖ పత్రికల్లో ఒక పెద్ద యాడ్ ఇచ్చి రాజకీయాల్లో ఒక మార్పు కోసం అని ప్రకటిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసారు. 2025 నాటికి బీహార్ ని దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగాక్ మారుస్తానని చెప్పడంతోపాటు 2030 నాటికి యూరప్ లోని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు బీహార్ రాజకీయాల్లోకి ఒక కొత్త రాజకీయ పార్టీని లాంచ్ చేస్తున్నట్టు చెప్పడమే కాకుండా తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించుకుంది. ఆమె పేరే పుష్పం ప్రియా చౌదరి.
సోమవారం నాడు బీహార్ లోని అన్ని ప్రముఖ పత్రికల్లో ఒక పెద్ద యాడ్ ఇచ్చి రాజకీయాల్లో ఒక మార్పు కోసం అని ప్రకటిస్తూ పత్రిక ప్రకటన విడుదల చేసారు. 2025 నాటికి బీహార్ ని దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగాక్ మారుస్తానని చెప్పడంతోపాటు 2030 నాటికి యూరప్ లోని రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్తానని చెప్పారు.
బీహార్ కి శాంతి కావాలి, దూసుకెళ్లడానికి రెక్కలు కావాలి, అన్నిటికంటే బీహార్ కి మార్పు కావాలి అని చెప్పిన ఆమె పోస్టు, బీహార్ ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కోరుకుంటుంది, బీహార్ ఇంకా నూతన ఎత్తులు ఎక్కేందుకు అన్ని అర్హతలు కలిగిన రాష్ట్రం గా ఆమె అభివర్ణించింది.
ప్రస్థిమితం ఉన్న చెత్త రాజకీయాలను వదిలేసి బీహార్ ని పరుగులు పెట్టిస్తూ ఆకాశ మార్గాన అభివృద్ధి పరచడానికి తమతో చేతులు కలపండని ఆమె కోరింది. ఇంతకు ఆమె పార్టీ పేరు చెప్పలేదు కదూ... "ప్లూరల్స్"
2020 నుంచి 2030 వరకు బీహార్ అభివృద్ధి అజెండాతోనే తాము పార్టీ స్థాపించినట్టు ఆమె తెలిపారు. ఇంతకు ఈమె ఎవరనే కదా...
ఎవరు ఈ పుష్పం ప్రియా చౌదరి.....
పుష్పం ప్రియా చౌదరి బీహార్ లోని దర్బంగా జిల్లాలో జన్మించింది. అక్కడ విద్యాభ్యాసం అనంతరం యూనివర్సిటీ అఫ్ సస్సెక్స్ లో ఎంఏ డెవెలప్మెంటల్ స్టడీస్ చదివింది. ఆ తరువాత లండన్ స్కూల్ అఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ పూర్తి చేసింది.
ఈమె తండ్రి బినోద్ చౌదరి నితీష్ కుమార్ పార్టీ జేడీయూ నుంచి మాజీ ఎమ్మెల్సీ తన కూతురు గతంలో కూడా తనతో చాలా సార్లు బీహార్ రాజకీయాల్లో మార్పు కావాలని అనిందని, తనను సైతం చాలాసార్లు రాష్ట్రానికి ఏమి చేయడంలేదని ప్రశ్నించిందని అన్నారు. కానీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని ఛాలెంజ్ చేయడం మాత్రం తగదని ఆయన అన్నారు. కానీ కూతురు కావడం వల్ల తన ఆశీస్సులు మాత్రం ఉంటాయన్నారు.
Also read: బాత్ బీహార్ కి: ప్రశాంత్ కిషోర్ "యువత" రాజకీయ వ్యూహమిదే...
ఇక ఆమె బాబాయి, దర్భాంగా జిల్లా జేడీయూ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇది హాస్యాస్పదమని, బీహార్ లోని ప్రజలెవరూ మార్పును కోరుకోవడంలేదని, మరో 15ఏండ్ల పాటు నితీష్ కుమార్ నే ముఖ్యమంత్రిగా బీహార్ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
ఇకపోతే ఆమె మంచి రాజకీయ మూలాలున్న కుటుంబం నుండే వచ్చారు. ఆమె తాత నితీష్ కుమార్ తో కలిసి 1994లో సమతా పార్టీని స్థాపించారు కూడా. నితీష్ కుమార్ వారి ఇంటికి చాలా సార్లు వచ్చారు కూడా. ఇంత రాజకీయ నేపథ్యమున్నప్పటికీ ఆమె చాలా కాలంగా బీహార్ కి దూరంగా ఉంది.
ఈ ఎన్నికల్లో ఆమె ఏమైనా ప్రభావం చూపగలదా?
ఈసారి ఎన్నికల్లో ఆమె ప్రభావం చూపడం చాలా కష్టంగా కనబడుతుంది. అక్కడ కులసమీకరణాలు పూర్తి రాజకీయాల్ని ప్రభావితం చేయగలవు. అలాంటి బీహార్లో ఈమె ప్రభావం చోపెట్టే ఆస్కారం లేదు.
ఎన్నికలకు మిగిలి ఉన్నదీ కేవలం మరో 6 నెలలు. ఈ తరుణంలో ఆమె కనీసం పార్టీ అభ్యర్థులను కూడా వెతుక్కోలేదు. సంస్థాగత నిర్మాణం అనేదానికి ఆస్కారమే లేదు. ఇప్పటికే యువకుడు కన్నయ్య కుమార్ అక్కడ బలంగా ఎదుగుతున్నాడు.
Also read: జగన్ సక్సెస్ ఫార్ములా: యువనేతల స్పెషల్ "యాత్ర"లు
జనగణమన యాత్ర పేరుతో రాష్ట్రమంతా ఒక రౌండ్ తిరిగాడు. ఎన్నికల వేళ మరోమారు తిరిగేందుకు సన్నద్ధమవుతున్నారు. తేజస్వి యాదవ్ తోపాటుగా చిరాగ్ పాశ్వాన్ కూడా యాత్రలు చేపడుతున్నారు.
వీరంతా బీహార్ ప్రజలతో మమేకమై ఉన్నవారు. వీరే ప్రజల ఆదరణ చూరగొనడానికి ఇంతలా కష్టపడుతుంటే... ఎక్కడినుండో వచ్చిన ఒక యువతీ ఇప్పటికిప్పుడు అక్కడ ప్రభావం చూపెట్టడం కష్టంగా కనబడుతోంది.