చిరంజీవి మెగా ఫ్యాన్ నూర్ భాయ్ ఈ ఉదయం ఆకస్మికంగా మృతి చెందాడు. రాత్రి ఇంట్లోనుండివెళ్లిన నూర్ భాయ్ ఉదయం కల్లా ముషీరాబాద్ లోని ఓ దర్గాలో విగతజీవిగా కనిపించాడు. దీంతో కుటుంబసభ్యలు, సహ అభిమానులు, మిత్రులు షాక్ కు గురయ్యారు. 

మెగా ఫ్యాన్ నూర్ భాయ్ అంటే తెలియని చిరంజీవి అభిమాని ఉండడు. నిస్వార్థంగా చిరంజీవికుటుంబానికి సేవలు చేసిన వ్యక్తి ఆయన. చిరువ్యాపారిగా మోండా మార్కెట్లో తమలపాకులు అమ్ముతూ, సీజన్ వారీగా చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించేవాడు. చిరంజీవిమీద ఉన్న అభిమానంతో చిరంజీవితో పాటు ఆయన కుటుంబంలోని హీరోలందరి సినిమాల రిలీజ్ లకు ఎంతో కష్టపడేవాడు. 

సినిమా హిట్ కోసం స్వయంగా కృషి చేసేవాడు. చిరంజీవి పేరుమీద తోటి అభిమానులతో కలిసి ఎన్నోసేవాకార్యక్రమాలు నిర్వహించేవాడు. తాజాగా రిలీజైన చిరంజీవి 151వ సినిమా సైరా విడుదలసమయంలో కూడా తమిళనాడులోని రజనీ ఫ్యాన్స్ తో అసోసియేట్ అయ్యి కార్యక్రమాలు చేశాడు. వారిని పిలిపించి స్వయంగా సినిమా చూపించి చిరంజీవి మీదున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 

ఆయన ఈరోజ ఉదయం ముషీరాబాద్ లోని ఓ దర్గాలో కన్నుమూశాడు. ఈ వార్త మెగా ఫ్యాన్స్ నుతట్టుకోలేని వార్త. ముఖ్యంగా చిరంజీవి కుటుంబానికి పెద్ద లోటు...సహ అభిమానులను తీరని లోటు..ఆయనను చూసి స్ఫూర్తి పొందినవారు ఎంతోమంది.

నూర్ భాయ్ మరణవార్త వినగానే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తరలివచ్చారు. ఆకస్మిక మృతికి సంతాపం తెలిపారు. వాళ్ల కుటుంబ సభ్యలను ఓదార్చారు..కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటానని మాటిచ్చారు. నూర్ భాయ్ కూతురి పెళ్లి మార్చ్ 1న పెట్టుకున్నారు. ఆయన మరణంతో ఆ పెళ్లి ఆగిపోవద్దని, కూతురి పెళ్లి జరపడమే ఆయన ఆత్మకు శాంతి అని తప్పకుండా జరిపిద్దాం అనిచిరంజీవి అన్నారు. ఆయన మంచితనాన్ని మూటగట్టుకుని వెళ్లాడని, ఎంత అవసరమైనా డబ్బులు అడిగేవాడు కాదని గుర్తుచేసుకున్నారు. 

నూర్ భాయ్ గా అందరూ పిలుచునే ఆయన పూర్తి పూరు MD నూర్ మహ్మద్. గ్రేటర్ హైదరాబాద్ మెగాఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయనకు భార్య ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన మరణంతో వారంతా దు:ఖసాగరంలో మునిగిపోయారు.

నూర్ భాయ్ మరణవార్త విని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా హుటాహుటిన తరలివచ్చాడు.మృతదేహం కాళ్లకు నమస్కరించి సంతాపం తెలిపాడు. కుటుంబానికి ఏ అవసరమైనా అండగాఉంటానని హామీ ఇచ్చారు. ఆయన మరణం తమకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశాడు. 

మెగా వీరాభిమాని మృతి.. దిగ్భ్రాంతిలో రాంచరణ్, ఆ ప్రకటన వాయిదా వేసిన బన్నీ!

అయితే సేవాకార్యక్రమాలు చేసే క్రమంలో ఎదురైన ఆర్గిక ఇబ్బందులను ఎవర్వకీ చెపకుండా తనలోతాను కుమిలిపోయినట్టు తనకు తెలిసిందని అతని మీద పుస్తకం రాసిన కందుకూరి రమేష్ బాబు అన్నారు. నూర్ భాయ్ సేవాతత్వం మీద, అభిమానం మీద ‘అభిమాని పిలిచే..’అనే పుస్తకం కూడా రమేష్ బాబు రాశారు.

మనశ్శాంతి కోసం ముషీరాబాద్ లోని దర్గాకు వెళ్లి మరుసటి ఉదయం విగతజీవిగా మారాడని ఆయన  మిత్రులు తెలిపారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల ఎవర్వరిమీదా అనుమానం లేదని ఆయనచేసిన సేవలు, మంచితనం, ఎవ్వరికీ చెప్పుకోని తత్వం వల్లే ఇది జరిగిందని సహ అభిమానులు ఉజ్వల్, అరవింద్, గౌతమ్, నవీన్ లు అన్నారు. ఈ సాయంత్రం ఆరు గంటలకు వైస్రాయ్ హోటల్ సమీపంలోని స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.