బాబుతో లెక్క సెటిల్ చేసుకుంటూనే జగన్ కు కేసీఆర్ వంత... ఏపీ కుదేలు

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో చంద్రబాబు నాయుడును అమాంతం హైద్రాబాద్ నుంచి పంపించివేసి ఒక్కసారిగా అనిశ్చితి పరిస్థితులను సృష్టిస్తే...ఇప్పుడు జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కెసిఆర్ వంత పాడడం ద్వారా నిర్మాణంలో ఉన్న అమరావతిని నామరూపాలు లేకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. 

KCR supports Jagan for settling the scores with Chandrababu Resulting into a disastrous AP

ప్రస్తుతానికి భారతదేశంలో ఆర్థికమందగమనం నడుస్తుంది. దేశంలో ఇలా ఆర్ధిక మందగమనం ఉన్నప్పటికీ కేంద్రప్రభుత్వం మాత్రం దీన్ని బహిరంగంగా ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. అదే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం నిర్మొహమాటంగా ఒప్పుకున్నారు. 

ఆయన బడ్జెట్ ఉపన్యాసంలో మాట్లాడుతూ... తెలంగాణలో కూడా ఇలా ఆర్ధిక మందగమనం ఉన్నప్పటికీ... తెలనగానా రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కన్నా నాయంగానే ఉందని అన్నారు. తెలంగాణను అయినా సరే దేశాన్ని అయినా సరే ప్రస్తుతానికి ఆర్థికంగా గాడిలో పెట్టడానికి అత్యవసరమైనవి పెట్టుబడులు. 

ఈ పెట్టుబడుల ఆవశ్యకతను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడో గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డనాటి నుంచే దానిపై మంచి అవగాహనతో కొనసాగుతున్నారు. హైద్రాబాద్ మహానగరం ఎప్పటినుండో అభివృద్ధి చెంది ఉండడం, ఐటీ హబ్ గా వెలుగొందుతూ ఉండడం వల్ల తెలంగాణాలో పెట్టుబడులు అలా వస్తున్నాయి. 

Also read; ఏపీకి 'విశాలాంధ్ర' దౌర్భాగ్యం: 60 ఏళ్ల నాటి దుస్థితి రిపీట్

ఇక ప్రస్తుతం తెలనగాణలో పారిశ్రామిక విధానం, నూతన పెట్టుబడుల ఆహ్వానానికి పెద్దపీట వేస్తున్నారు. అది స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణ ఏర్పడ్డ తొలి 5 ఏండ్లలో రాష్ట్రంలోకి చాలా బహుళ జాతీయ కంపెనీలు వచ్చాయి. పెట్టుబడులు పెట్టాయి. 

ఒక్కసారి కొత్తగా ఏర్పడ్డ మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ను గనుక తీసుకుంటే.... ఒక హైద్రాబాద్  లాంటి మహానగరం లేదు. అయినప్పటికీ అమరావతిని కట్టుకోవాలని సంకల్పించారు. అలా కడుతూనే రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేసారు. కియా మోటార్స్ ప్లాంట్ అలా వచ్చిందే. 

ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్రం కాబట్టి, అందునా ప్రత్యేక హోదా కల్పిస్తామని ఇచ్చిన మాటను కూడా కేంద్రం తప్పిన నేపథ్యంలో.... నూతన పరిశ్రమల కోసం కనీసం టాక్స్ హాలిడే అయినా తెచ్చుకొని ఉంటే రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగేవి. 

కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న కొన్ని రాజకీయ కక్ష సాధింపు చర్యల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో పెట్టుబడిదారులు లేరు. రివర్స్ టెండరింగ్ నుండి మొదలుపెడితే.... రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పవన, సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వరకు ప్రతి కంపెనీ పైన కూడా జగన్ పడ్డారు. 

అసలే ఆర్ధిక భారం ప్రపంచవ్యాప్తంగా కనబడుతుంది. దానికి భారతదేశమో, మన ఇరు తెలుగు రాష్ట్రలో అతీతం కాదు. ఎప్పుడైతే ఇలా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ విధానాలు పార్టీ మారినప్పుడల్లా మారుతాయని బయట ఇన్వెస్టర్లకు అర్థమయిందో వారు ఆంధ్రప్రదేశ్ వైపు చూడడం తగ్గించారు. 

ఇక్కడే తెలంగాణ ముఖ్యమంత్రి చతురత ఆయన దార్శనికత ఎంతలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఆయన చంద్రబాబుతో ఉన్న పాత లెక్కలు సరిచేసుకుంటూనే... జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి వంత పాడారు. 

దక్షిణాదిలో పెట్టుబడులకు ఇరు తెలుగు రాష్ట్రాలు అనుకూలం. తక్కువ రేట్లకు భూములు దొరకడంతోపాటు నైపుణ్యత కలిగిన ఉద్యోగార్థులు ఇక్కడ అధిక సంఖ్యలో అందుబాటులో ఉంటారు. (ఇంజనీరింగ్ కాలేజీలకు ఇక్కడ థాంక్స్ చెప్పాలేమో)

ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై నమ్మకంపోయిందో... పెట్టుబడులు పెట్టేవారికి అనువైన మరో ప్రాంతం. కాబట్టి పెట్టుబడులు తెలంగాణకు తరలివస్తాయి. ఇప్పటికే తేలానగన్ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా నుండి దావోస్ వరకు పెట్టుబడులను ఆకర్షించడానికి కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు. 

మరొపక్కనేమో ఏపీ నుండి ఎవరు ఇలా ఆర్ధిక సమావేశాలకు వెళ్లినట్టు కూడా కనబడడం లేదు. అక్కడ పెట్టుబడులు పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రావడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రస్తుతం ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోయారు. 

ఇలా ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోయిన తరువాత టాక్స్ హాలిడేస్ ప్రకటించినా పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. వచ్చే ప్రభుత్వం మళ్ళీ ఇలా రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగదనే నమ్మకం ఏమిటి అని ప్రశ్నిస్తే...దానికి సమాధానం లేదు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. 

Also read; బాబు, జగన్ ల "రైతు రాజకీయం"... అమరావతి నేర్పిన పాఠాలు ఇవే...

ఇలా ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక నగరంలో ఐటీ కంపెనీలు ఏర్పాటు అయితే అక్కడే పనిచేద్దామనుకున్న ఎందరో ఆంధ్ర రాష్ట్రానికి చెందిన యువత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పుణ్యమాని హైదరాబాద్ తో సహా కొత్తగా తెలంగాణాలో నూతనంగా ఏర్పాటైన వరంగల్ ఐటీ పార్కులోని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 

ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో చంద్రబాబు నాయుడును అమాంతం హైద్రాబాద్ నుంచి పంపించివేసి ఒక్కసారిగా అనిశ్చితి పరిస్థితులను సృష్టిస్తే...ఇప్పుడు జగన్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కెసిఆర్ వంత పాడడం ద్వారా నిర్మాణంలో ఉన్న అమరావతిని నామరూపాలు లేకుండా చేయడంలో సఫలీకృతుడయ్యాడు. 

రాజకీయాల్లో రాజకీయ నాయకులు తమ పేరును చిరస్థాయిగా నిలిచిపోయేవిధంగా చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంటారు. కీర్తి కాంక్ష అనేది ప్రతి రాజకీయ నాయకుడికి ఉండేదే. కాంక్ష ఉండగానే సరిపోదు. 

ఆ కీర్తిని సంపాదించేందుకు కష్టపడాల్సిందే. కెసిఆర్ ఇలా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్థితులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి అనుకూలంగా కరెక్ట్ గా వాడుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపైన తెలంగాణ నేతలు జోకులు వేయడం అక్కడ పరిస్థితిని చెప్పకనే చెబుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios