బీజేపీ తో పొత్తు: పవన్ కళ్యాణ్ కి కలిగే సత్వర ప్రయోజనాలు ఇవే...

రాజకీయంగా జనసేన పార్టీయే సంస్థాగత నిర్మాణం లేక గింజుకుంటుంటే, మరో ఇటువంటి నిర్మాణం లేని బీజేపీతో కలిసారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అది విస్మరించలేని నిజం కూడా. కాకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం, ఇలా ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి ముందుకు పోవడం వల్ల జనసేనకు మాత్రం కొన్ని డైరెక్ట్ లాభాలు సత్వరమే కనబడేలా గోచరిస్తున్నాయి. 

janasena-bjp alliance: pawan kalyan gets some immediate benefits

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రాజకీయం మంచి కాక మీద ఉంది. అధికార వైసీపీ వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు అనుకూలంగా అసెంబ్లీలో ఇప్పటికే బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై నేడు కూడా చర్చ కొనసాగుతుంది. 

ఇక ఈ రాజధాని అంశంలో నెలకొన్న అనిశ్చితి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చివేసింది. వైసీపీ కి ఉన్న భారీ మెజారిటీకి వాస్తవానికి రాష్ట్రంలో ఇతర పార్టీలకు కనీసం ఒక సంవత్సర కాలంపాటయినా రాజకీయంగా తగిలిన షాక్ నుంచి తేరుకోవడానికే సరిపొద్దని అందరూ భావించారు. 

కాకపోతే అనూహ్యంగా ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన మూడు రాజధానులు అనే ప్రకటన చేసారో... అది మొదలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన విపక్షాల్లో జవసత్వాలు వచ్చాయి. ఇటు టీడీపీ అయినా, అటు జనసేన అయినా సరే ఒక్కసారిగా ఆక్టివ్ అయ్యాయి. 

Also read: చంద్రబాబు టు జగన్ ...ఏపీ రాజకీయాన్నంతా రాజధాని చుట్టూ తిప్పడంలో కెసిఆర్ సక్సెస్

రాజధాని విషయంలో నడుస్తున్న రచ్చ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ సమీకరణ కూడా పుట్టుకొచ్చింది. ఒక బలమైన ఆలంబన కోసం ఎదురు చూస్తున్న జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంది. 

రాజకీయంగా జనసేన పార్టీయే సంస్థాగత నిర్మాణం లేక గింజుకుంటుంటే, మరో ఇటువంటి నిర్మాణం లేని బీజేపీతో కలిసారని చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అది విస్మరించలేని నిజం కూడా.

కాకపోతే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలవడం, ఇలా ఈ రెండు పార్టీలు ఇప్పుడు కలిసి ముందుకు పోవడం వల్ల జనసేనకు మాత్రం కొన్ని డైరెక్ట్ లాభాలు సత్వరమే కనబడేలా గోచరిస్తున్నాయి. 

బీజేపీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని తమ వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న లీడర్, క్రౌడ్ పుల్లర్ వారికి అవసరం ఉంది. ఇది ఎలాగూ జరిగేదే కదా అని అనుకోవచ్చు. ఇప్పుడిది జరగడం జనసేన ఎప్పటినుండో కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకనుంది. 

జనసేన పార్టీకి ఒక మంచి స్పీకర్ దొరకడం లేదు. అన్ని మీడియా డిబేట్స్ లో పాల్గొనగలిగే ఒక మంచి నేత కానీ, పబ్లిక్ స్పీకర్ కానీ లేరు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా రోజు కనపడరు. పవన్ పబ్లిక్ ప్రెజన్స్ లేకపోతే... జనసేనకు మీడియా అటెన్షన్ దక్కదు. 

ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేన వాయిస్ ను కూడా బీజేపీ వినిపిస్తుంది. పవన్ కళ్యాన్ని పూర్తిగా తమ వ్యక్తిగా సొంతం చేసుకుంటారు. అప్పుడు జనసేన వాయిస్ ని వినిపిస్తారు, ఎవరన్నా జనసేన నాయకులను అవసరమైతే డిఫెండ్ చేస్తారు కూడా. 

Also read: వైఎస్ జగన్ మొండిఘటం: పవన్ కల్యాణ్ ధీటు రాగలరా?

బీజేపీ సోషల్ మీడియా వింగ్ బలం కూడా పవన్ కళ్యాణ్ కి అవసరమవుతుంది. ఇప్పుడు అధికార వైసీపీ పార్టీ ట్రెండ్ చేసినంత తొందరగా జనసేన ట్రెండ్ చేయలేదు. బీజేపీ ఇట్ సెల్ గనుక తోడయితే పవన్ కి సోషల్ మీడియాలో ఇప్పటికే ఉన్న బలానికి తోడు అదనపు ఆయుధ సంపత్తి తోడయినట్టవుతుంది. 

పవన్ కళ్యాణ్ ని ఇక సీరియస్ గా తీసుకోవడం మొదలుపెడుతుంది అధికార వైసీపీ. ఎంత అవునన్నా కాదన్నా జాతీయపార్టీ తోడుండడం, అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని మాత్రం బీజేపీ సీరియస్ గా తీసుకుంటుంది. 

జగన్ ని ఇప్పటికే మతం ఆధారంగా టార్గెట్ చేస్తుంది బీజేపీ. ఇన్ని రోజులుగా టార్గెట్ చేస్తున్నప్పటికీ...బీజేపీకి ఒక బలమైన పేస్ లేకపోవడం వల్ల వారు అంతలా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్లలేకపోతున్నారు. 

ఇప్పుడు పవన్ గనుక పదే పదే మతం ఆధారంగా గనుక టార్గెట్ చేస్తూ, విమర్శలను గుప్పిస్తే, దానికి బీజేపీ నెట్ వర్క్, తోడయితే దాన్ని ఎదుర్కోవడం జగన్ కు అంత తేలికైన పని కాదు. ఈ పరిస్థితి వైసీపీకి కూడా తెలుసు. అందుకోసం వారు సైతం ఒకింత పవన్ ని కొంచం సీరియస్ గా ట్రీట్ చేయడం మొదలుపెడతారు. 

లాంగ్ టర్మ్ లో ఇది ఎలా ఉంటుందో చెప్పలేకున్నప్పటికీ... ప్రస్తుతం షార్ట్ టర్మ్ లో మాత్రం జనసేనకు ఒకింత ఉపయుక్తకరంగా ఉంటుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios