Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి ఇది సరైన సమయం.. క్రూడాయిల్ మార్కెట్‌ పరిస్థితుల్లో మార్పు

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి ఇదే సరైన సమయం. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరలు తగ్గాయి. ఇంకా కొంత కాలం ఇదే ధోరణి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. గతంలో బ్యారెల్ ధరల పెరుగుదలతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నష్టాలు వచ్చినా.. ఇటీవలి కాలంలో అవి గాడిలో పడ్డాయి. కానీ, ఇప్పుడు సగటు వినియోగదారుడిపై గతేడాది ఏప్రిల్, మార్చి నెలల నుంచి ఒత్తిడి కొనసాగుతూనే ఉన్నది. 
 

it is time to cut retail prices of oil as crude market show softening trends kms
Author
First Published Jun 21, 2023, 4:07 PM IST

అంతర్జాతీయ చమురు విపణిలో పరిస్థితులు మన లాంటి దేశాలకు అనుకూలంగా ఉన్నాయి. భౌగోళిక రాజకీయాల కారణంగా గతేడాది నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. చమురును సింహ భాగం దిగుమతి చేసుకునే మనలాంటి దేశాలు ఈ ధరల పెరుగుదలతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. శక్తివంతమైన ఓపెక్ ప్లస్ కూటమి ధరల నియంత్రణకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా అవి క్షీణించడం గమనార్హం.

ధరలను అదుపులో ఉంచడానికి తాజాగా సౌది అరేబియా ప్రతి రోజు ఉత్పత్తిలో ఒక మిలియన్ బారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించింది. సాధారణంగా రోజుకు పది మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేయాలనేది టార్గెట్. ఇప్పటి వరకు ఈ నిర్ణయం ప్రభావం మాత్రం పెద్దగా పడలేదు. మార్కెట్‌లో ఇప్పటికీ ఒక బ్యారెల్ చమురు ధర 70 నుంచి 75 అమెరికన్ డాలర్లు ఉన్నాయి.

ఈ ఏడాది జనవరిలో క్రూడాయిల్ ధరలు పడిపోవడం మొదలైంది. వడ్డీ ధరల్లో మార్పు ఉండదని, దేశ ద్రవ్యోల్బణ అదుపులోకి(రెండు శాతం టార్గెట్‌కు వచ్చే వరకు ) వచ్చే వరకు వడ్డీ ధరలు మార్చబోమని అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించింది. కాలిఫోర్నియాకు చెందిన సిలికన్ వ్యాలీ బ్యాంక్ దివాళా తీసిన తర్వాత ఆర్థిక సంక్షోభ భయాలు నెలకొన్నాయి. కానీ, ఏప్రిల్‌లో పరిస్థితులు వేగంగా మారాయి. ఓపెన్ ప్లస్ కూటమి చమురు ఉత్పత్తి తగ్గించి డిమాడ్ పెంచి రేట్లును పెంచంతో అమెరికా కొంతలో కొంత మెరుగుపడింది. అప్పుడు ఒక బ్యారెల్ ధర రూ. 87కు పెరిగింది. కానీ, మార్కెట్ పరిస్థితులు మళ్లీ యథాతథ స్థితికి చేరాయి.

ప్రస్తుతం చమురు ఉత్పత్తి దారులకు కొంత క్లిష్ట పరిస్థితులే ఉన్నాయి. చైనాలో ఆర్థిక స్థితి ఇంకా మెరుగుపడలేదు. దీనికి తోడు రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ ఇతర దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.  ఈ పరిస్థితులు చమురు ఉత్పత్తిదేశాలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. రష్యా, మరో తొమ్మిది చమురు ఉత్పత్తి దేశాలు ఒపెక్‌లో ర2016లో కలిశాయి. దీన్నే ఒపెక్ ప్లస్ అని పిలిచారు.

అయితే, ఈ పరిస్థితులు భారత్‌కు కలిసివచ్చేలా ఉన్నాయి. భారత్ 80 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. గతంలో అంతర్జాతీయ ధరలు 100 డాలర్లకు పెరుగుతాయనే అంచనాలు వచ్చాయి. ఇది దేశ ఖజానాపై ఒత్తిడి తెచ్చే పరిణామం. గోల్డ్ మాన్ శాక్స్ కూడా చమురు ధరలు పెరుగుతాయనే తెలిపింది. ఈ ఏడాది చివరినాటికి బ్యారెల్ ధర 90 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలా ఏమీ కనిపించడం లేదు. కానీ, రానున్న నెలల్లో భౌగోళిక రాజకీయ పరిస్థితుల బట్టి ధరల పెరిగే అవకాశాలనూ కొట్టిపారేయలేం.

Also Read: ఢిల్లీలో ఎన్నికల అధికారులను కలిసిన గద్దర్.. కొత్త పార్టీ పేరు ప్రకటన..

ఈ ముప్పు నుంచి భారత్ తప్పించుకుంది. భారత్ చాలా వరకు రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటున్నది. ఏడాది కింద బ్యారెల్ ధర 116 డాలర్లు ఉండగా.. ఇప్పుడు 40 శాతం తక్కువ ధరతో భారత రిఫైనరీలు దిగుమతి చేసుకున్నాయి. ఇప్పుడు 71 డాలర్లకే బ్యారెల్‌ చమురు దిగుమతి చేసుకుంటున్నాయి. గతేడాది ఆయిల్ బిల్లు 211 బిలియన్ డాలర్లు అయితే.. ఈ సారి ఈ బిల్లు ఇంకా తగ్గే అవకాశం ఉన్నది.

ఇక విధాన రూపకర్తలు ఒక పని చేయాల్సి ఉన్నది. అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో దేశంలోనూ రిటైల్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సి ఉన్నది. గతేడాది అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగినా ఆయిల్ కంపెనీలను ధరలు పెంచకుండా ప్రభుత్వం ముకుతాడు వేసింది. గతేడాది మే నెలలో ఎక్సైజ్ డ్యూటీని కట్ చేసి వినియోగదారులకు ఉపశమనం కల్పించింది. ఈ నిర్ణయం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నష్టాలను చేకూర్చింది. 

ఈ సందర్భంలో టెక్నికల్‌గా చెప్పాలంటే చమురు ధరల నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉన్నట్టే. ఒక వేళ అంతర్జాతీయంగా ధరలు పెరిగినట్టే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగానూ రిటైల్ ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పతనమై వినియోగదారులపై తీవ్ర ఒత్తిడి పడేది.

అయితే.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గాడిలో పడ్డాయి. ఇటీవలి నెలల్లో లాభాలనూ గడించాయి. ఇప్పుడ అధిక ధరలతో వినియోగదారుడిపై భారం పడుతున్నది. కాబట్టి, ప్రభుత్వం రిటైల్ ధరలను తగ్గించి సగటు వినియోగదారుడికి ఉపశమనం కల్పించాలి.

గతేడాది మే నెలలో ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా అనేక సార్లు మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ధరలు పెరిగాయి. అప్పటి నుంచి అవే ధరలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఇప్పుడు ధరలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ చమురు మార్కెట్‌లను చూస్తే ఇప్పటికిప్పుడే పెద్ద మార్పులు జరిగేలా లేవు. కాబట్టి, దేశంలో రిటైల్ చమురు ధరలు తగ్గించడానికి ఇదే సరైన సమయం.

 

--- సుష్మా రామచంద్రన్

Follow Us:
Download App:
  • android
  • ios