ప్రత్యూష, అయేషా మీరా కేసుల్లో ఏమైంది: దిశ కేసు ప్రత్యేకమా...

దిశా కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఈ విధంగా సత్వర న్యాయం జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సగటు మనిషి మస్తిష్కంలో న్యాయం జరగడానికి రెండు ప్రత్యేక కండిషన్లను పోలీసులు విధించారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

Equality of justice: why justice only to Disha and not ayesha mira or prathyusha?

తెలంగాణాలో జరిగిన దిశ దుర్ఘటనలో న్యాయం జరిగిందని యావత్ భారత దేశం గొంతెత్తి నినదిస్తుంది. అత్యంత పాశవికంగా వైద్యురాలు దిశ హత్యాచార ఘటనలో నిందితులు నేటి ఉదయం అదే చటాన్ పల్లి అండర్ బ్రిడ్జి వద్ద తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసుల ఎన్ కౌంటర్లో మృతి చెందారు. 

ఈ ఎన్ కౌంటర్ జరిగిన తరువాత ప్రజలు వీధుల్లోకి వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలెబ్రిటీలు సైతం ఇది చాలా శుభపరిణామమని, తగిన న్యాయం జరిగిందని అంటున్నారు.

ఈ ఎన్ కౌంటర్ తరువాత ఇలాంటి ఓ హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆయేషా మీరా కన్నతల్లి చేసిన వ్యాఖ్యలను మనం ఒకసారి ఆలోచించాల్సి వస్తుంది. 

Also read: CP V.C. Sajjanarఎన్ కౌంటర్ స్పెషలిస్ట్: ఎవరీ వీసీ సజ్జనార్?

ఈ ఎన్ కౌంటర్ జరగగానే ఆ బాధితురాలి తల్లి మాట్లాడుతూ, ఇంతలో కొంతైనా ఈ దిశ కు న్యాయం జరిగిందని, తన కూతురి విషయంలో మాత్రం తనకు న్యాయం జరగలేదని వాపోయింది. దిశ హత్య కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఎన్ కౌంటర్ చేశారంటూ ఆమె ఆరోపించారు. 

నిందితులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఎన్ కౌంటర్ వల్ల దిశకు కొంత న్యాయం జరిగినట్లేనని స్పష్టం చేశారు. ఇకపోతే తన కుమార్తె అయేషా మీరా హత్య కేసులో తనకు న్యాయం జరగలేదని వాపోయారు.  

రాజకీయ జోక్యంతోనే తన బిడ్డ అయేషా మీరాకు న్యాయం జరగడం లేదన్నారు. అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని ఆయేషా తల్లి అన్నారు. సజ్జనార్‌ లాంటి అధికారి ఆయేషామీరా కేసును దర్యాప్తు చేసుంటే తమ బిడ్డకు న్యాయం జరిగేదని ఆమె అభిప్రాయపడ్డారు. 

అయేషా మీరా తల్లి స్పందించిన కొద్దిసేపటికే ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా కూడా ఇదే విధంగా ట్వీట్ చేసారు.   గుత్తా జ్వాలా తన ట్వీటర్‌ "ఇది భవిష్యత్ రేపిస్టులను ఆపుతుందా ?? ఒక ముఖ్యమైన ప్రశ్న... ప్రతి రేపిస్టును ఒకే విధంగా చూస్తారా ... వారి సామాజిక స్థితితో సంబంధం లేకుండా?!" అంటూ ప్రశ్నించారు.

ప్రజలు ఎప్పటినుండో న్యాయం కావలి అని డిమాండ్ చేస్తూ...వారిని ఎన్ కౌంటర్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఈ అన్ని పరిస్థితులను చూస్తే, ఒక విషయం మాత్రం మనకు అర్థమవుతుంది. ప్రజలకు న్యాయవావస్థ మీద నమ్మకం లేదనే విషయం తేటతెల్లమవుతుంది. ఇక్కడ ప్రజలు న్యాయం జరిగిందని ఎన్ కౌంటర్ ను భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సగటు మనిషి మస్తిష్కంలో న్యాయం జరగడానికి రెండు ప్రత్యేక కండిషన్లను పోలీసులు విధించారా అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

న్యాయం జరగాలంటే నిందితులు సామాన్యులు అయి ఉండాలి... 

దిశా కేసులో నిందితులు సామాన్యులు కాబట్టే ఈ విధంగా సత్వర న్యాయం జరిగిందని చాలా మంది భావిస్తున్నారు. ఒక వేళ ఇది అబద్ధమయి ఉంటే, అయేషా మీరా తల్లి ఇలా బయటకు వచ్చి సజ్జనార్ ను వేడుకునేది కాదు కదా. ఇన్ని సంవత్సరాలైనా సినీ హీరోయిన్ ప్రత్యుష తల్లి న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగేది కాదు కదా. 

ఈ రెండు కేసుల్లోనూ వాస్తవానికి నిందితులు బడాబాబుల, రాజకీయనాయకుల పుత్రరత్నాలన్నది అక్షర సత్యం. కాకపోతే సమాజంలో వారికున్న పేరు పలుకుబడి, డబ్బు ఇవన్నీ వారిని కేసులబారి నుండి రక్షించాయి. వారికి అవన్నీ శ్రీరామ రక్షాలుగా వారిని కాచి కాపాడాయి.

Also read: సజ్జనార్ మాత్రమే కాదు... వీరు అంతకుమించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు 

సామాన్య నిందితులు అయి ఉంటె వారి విషయంలోనూ సత్వర న్యాయం జరగకున్నా, ఏదో ఒక విధంగా న్యాయం మాత్రం జరిగి ఉండేది. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి అయినా చేకూరి ఉండేది వారి కుటుంబాలన్న సమాజంలో న్యాయం ఇంకా బ్రతికి ఉంది అని ఒక నమ్మకంతో అన్నా ఉండేవారు. 

కానీ పాపం వీరి విషయంలో ఆ సదరు ఇద్దరు అభాగ్యపు మహిళలు న్యాయం జరగాలంటే ఫాలో కావాల్సిన ఫస్ట్ కండిషన్ ను మిస్ అయ్యారు. అయినా పోలీసులు ఆ కండిషన్ ని అమలు చేస్తున్నారని ఆ బాధితులకు తెలియకపోయే!ఇక రెండో కండిషన్.. 

న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాలి... 

దిశ ఉదంతం కానీయండి, లేదా వరంగల్ ఆసిడ్ దాడి ఉదంతం కానీయండి, దేశ వ్యాప్తంగా ఉధృతంగా నిరసనలు వెల్లువెత్తిన తరువాత మాత్రమే పోలీసులు సత్వర న్యాయం అందిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇంతకంటే దారుణమైన చర్యకు ఒడిగట్టిన శ్రీనివాస్ రెడ్డిని ఇంకా జైల్లోనే ఉంచి పోలీసులు న్యాయ విచారణ జరుపుతున్నారు. 

ఇక్కడ చెప్పొచ్చేదేంటంటే పోలీసులు న్యాయం చేయాలంటే అందరికి ఒకేలాగా చేయడం లేదు. అందరికి సమన్యాయం అనే సిద్ధాంతానికి ఇది విఘాతం కలిగిస్తుంది. ఈ కేసుకు మరో మంచి ఉదాహరణ పడవ తరగతి అమ్మాయి సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి. అది కూడా హత్యాచారమేఅయినా పోలీసు వారు మాత్రం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. 

ప్రతి కేసులోనూ పోలీసువారిని ఇంతే కఠిన వైఖరిని తీసుకోమని, ప్రతి ఒక్కరిని కాల్చమని ఇక్కడ చెప్పడం కాదు. న్యాయం అందించడం అంటే అందరికి సమ న్యాయం అండిన్బచాలి అంతే తప్ప న్యాయం అందించడంలో ఇలాంటి పక్షపాత వైఖరి ఉండకూడదు. 

వ్యవస్థలో సమూల మార్పులు వచ్చి, అందరికి సమ న్యాయం జరిగినప్పుడు మాత్రమే న్యాయం బ్రతికి ఉందని నమ్మాలి తప్ప, ఇలా పాక్షిక పక్షపాత న్యాయాలు జరిగినప్పుడు న్యాయం గెలిచిందనలా? డబ్బు, పలుకుబడి లు పోటీ నుండి ఉపసంహరించుకోవడంతో న్యాయం గట్టెక్కిందనలో అర్థం కావడంలేదు. ఏది ఏమైనా ఇక్కడ ఓడిపోతుంది మాత్రం ధర్మం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios