Asianet News TeluguAsianet News Telugu

కరోనా వైరస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కన్నా మన కేసీఆరే మిన్న!

అమెరికా పరిస్థితిని చూస్తే... ఒక్క న్యూయార్క్ నగరంలోనే 40 నుంచి 80 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఇక ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ రిపోర్టు ఆధారంగా గనుక మాట్లాడితే... కఠినమైన చర్యలను నిర్బంధంగా తీసుకోకపోతే.... దాదాపుగా 2 లక్షల పైచిలుకు మంది మరణించే ఆస్కారం ఉన్నట్టుగా తెలుపుతున్నారు. 

Coronavirus: How US president Donald Trump failed and KCR Succeeded in Tackling the outbreak
Author
Hyderabad, First Published Mar 23, 2020, 6:24 PM IST

ప్రపంచాన్ని కరోనా వైరస్ కుదిపేస్తోంది. ఎక్కడో చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకింది. ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలను వణికిస్తోంది. అగ్ర రాజ్యం అమెరికా ఈ వైరస్ వల్ల కుదేలయింది. అమెరికాలో మరణాలు నాటి నాటికీ పెరిగిపోతున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించడమే కాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించాడు. అగ్ర రాజ్యంలో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా చేయిదాటిపోయే స్థితిలో ఉంది. ఇప్పటికిప్పుడు అత్యవసర చర్యలు తీసుకోకపోతే... మరో ఇటలీగా అమెరికా మారుతుందనడంలో ఎటువంటి సంశయం అవసరం లేదు. 

ప్రస్తుత అమెరికా పరిస్థితిని చూస్తే... ఒక్క న్యూయార్క్ నగరంలోనే 40 నుంచి 80 శాతం మందికి కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టులు వస్తున్నాయి. ఇక ఇంపీరియల్ కాలేజీ అఫ్ లండన్ రిపోర్టు ఆధారంగా గనుక మాట్లాడితే... కఠినమైన చర్యలను నిర్బంధంగా తీసుకోకపోతే.... దాదాపుగా 2 లక్షల పైచిలుకు మంది మరణించే ఆస్కారం ఉన్నట్టుగా తెలుపుతున్నారు. 

అమెరికాలో ఈ పరిస్థితికి కారణాలేంటి...?

కరోనా ను జనులరీలోనే గుర్తించిన కొందరు శాస్త్రవేత్తలు అమెరికాలోని కొన్ని రీజినల్ హెల్త్ సెంటర్లను అప్రమత్తం చేసారు. కాకపోతే... ఒక్కడే చైనా దేశస్థుడు ఇప్పటి వరకు అమెరికా వచ్చాడు, పరిస్థితంతా అదుపులోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. 

విరివిగా టెస్టింగులు  అవసరమైన కిట్లు చాలా తక్కువబడ్డాయి. కిట్స్ షార్టేజ్ ఉండడం వల్ల కేవలం విదేశాల నుంచి వచ్చినవారికి టెస్టులు చేసారు తప్ప లక్షణాలు ఉన్నప్పటికీ... వారందరని టెస్టు చేసిన పాపాన మాత్రం అమెరికా పోలేకపోయింది. 

Also read: మనసుల్ని గెలిచిన నేతలు: మోడీ రెండోసారి, కేసీఆర్ తొలిసారి!

చాలా మంది ఈ వైరస్ లక్షణాలతో ఆసుపత్రుల బయట వేచి ఉన్నప్పటికీ... వారిని అలా వదిలివేయవలిసిన దుస్థితి. దానికి తోడు ప్రైవేట్ వారు అంత త్వరగా భాగస్వాములు కాలేదు. చైనీయులను ఆపారు కానీ... చైనా నుండి వస్తున్న అమెరికన్లను ఆపలేకపోయారు. 

ఇలా బయట దేశాల నుండి కరోనా విరివిగా అమెరికాలోకి దిగుమతి అయింది. దిగుమతయినా తరువాత టెస్టింగ్ సెంటర్లు లేక చాలా మంది అలా బయట తిరుగుతూనే ఉన్నారు. వారంతా అందరికి ఈ వైరస్ ని అంటిస్తునే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు సౌత్ కొరియాను ఆదర్శంగా తీసుకుంటే బాగుండేది. 

సౌత్ కొరియా ఏం చేసింది...?

దక్షిణ కొరియా ఇలా వైరస్ విలయతాండవం చేస్తుందనగానే... దేశంలోకి అన్ని దారులను బంద్ చేసి ప్రజలందరినీ టెస్ట్ చేయడం ఆరంభించింది. విరివిగా టెస్ట్ చేయడం వల్ల అనుమానితులను, లక్షణాలున్నవారిని బయటకు తీసి వారిని మిగిలిన వారి నుండి సెపెరేట్ చేసింది. 

ఇలా చేయడం వల్ల కరోనా ను కంట్రోల్ చేయగలిగింది దక్షిణ కొరియా ప్రభుత్వం. వారు వాస్తవిక స్థితిని ఒప్పుకొని టెస్టింగులకు పూనుకొని, అనుమానితుల వెంటబడి వారిని ఐసొలేషన్ వార్డులకు తరలించారు. 

అమెరికా ఈ పని చేయడం మరిచింది. ఎన్నికల సమయం కావడం వల్ల పరిస్థితంతా మామూలుగానే ఉందని ట్రంప్ చెబుతూ వచ్చాడు. ఒకవేళ ఎవరైనా పాత్రికేయుడు కానీ డాక్టర్ కానీ వాస్తవిక స్థితి ఇదీ అంటే... వారిపై డెమొక్రాట్ల పక్షం అనే ముద్ర వేసాడు ట్రంప్. 

ఇప్పుడు అమెరికాలో పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే... అక్కడ సాధారణంగా ఒక డ్రగ్ మార్కెట్లోకి రావాలంటే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు తప్పనిసరి. కానీ అలాంటివి లేకుండానే... యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో కలిపి ఆంటిబయోటిక్ అజిత్రోమైసిన్ ఇవ్వాలని సంకల్పించారు. 

అదే గనుక ముందుగానే ట్రంప్ తేరుకొని ఉండి ఉంటే... కనీసం ఇటలీని చూసి అయినా నేర్చుకొని ఉంటే... అప్పుడు అమెరికా ఈ పరిస్థితి నుండి బయటపడేది. అమెరికా పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణను చూడండి ఎలా ఉందొ.... 

తెలంగాణ ఎలా డిఫరెంట్ అంటే... 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత కరోనా చాలా చిన్న విషయంగా... పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని చెప్పినప్పటికీ... తరువాత పరిస్థితి చేయిదాటేలా ఉంది అనగానే, ఇటలీ నుంచి నేర్చుకున్న పాఠాలే కానివ్వండి చాలా తెలివిగా ప్లాన్డ్ గా రెస్పొంద్ అయ్యారు. 

ఆయన కరోనా పరిస్థితులు ఇవీ అని బహిరంగంగా చెప్పడం వల్ల ఫేక్ న్యూస్ కి ఆస్కారం లేకుండా పోయింది. ఆయన ప్రజలకు ఎప్పటికప్పుడు అసలు విషయాన్నీ చెప్పడానికి ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉన్నారు. 

Also read: పారాసిటమాల్ వ్యాఖ్యలు: కేసీఆర్ కు జగన్ కి మధ్య తేడా ఇదే!

రోజు హై లెవెల్ మీటింగులను నిర్వహిస్తూ... అధికారులను పరుగులు పెట్టిస్తూ ప్రజలందరిలోనూ ఒక విశ్వాసాన్ని నింపగలిగారు ప్రజలందరి సహాయ సహకారాలు కోరుతూనే... తానున్నానని కొరోనాను సావగొడతానని అన్నాడు. 

కేసీఆర్ మాటలను ప్రజలు కూడా చాలా వరకు నమ్మారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే.... తెలంగాణ చాలా బెటర్ అందరిని ట్రేస్ చేసి తీసుకొచ్చి క్వారంటైన్ లో ఉంచుతున్నారు. 

ఆయన అలా మిగిలినవారందరికి కూడా ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఎలా నమ్మారంటే... కారానికి అమ్మ మొగుడు కేసీఆర్ అని సోషల్ మీడియాలో తెగ కామెంట్ చేస్తున్నారు. బయట కూడా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ కాబట్టి ఇలా చేయగలుగుతున్నారంటూ కితాబు ఇస్తున్నారు. 

ఇటలీ ఉదాహరణ కనబడుతున్నప్పటికీ.... అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేయలేకపోయింది... తెలంగాణ సీఎం కేసీఆర్ చేసి చూపించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios