చైనాను వణికిస్తున్న ప్రాణాంతక వైరస్.. భారత్ కు పొంచి ఉన్న ముప్పు?
చైనాను భయంకరమైన సార్స్ లాంటి వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు మరణించారని చైనా అధికారకంగా ప్రాకటించినప్పటికీ వాస్తవానికి కొన్ని వందలమంది చనిపోయినట్టు అక్కడ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపినట్టు అల్ జజీరా ఛానల్ తెలిపింది.
వుహాన్: చైనాను భయంకరమైన సార్స్ లాంటి వైరస్ వణికిస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు మరణించారని చైనా అధికారకంగా ప్రాకటించినప్పటికీ వాస్తవానికి కొన్ని వందలమంది చనిపోయినట్టు అక్కడ నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపినట్టు అల్ జజీరా ఛానల్ తెలిపింది.
ఈ కొత్త రకం కరోనా వైరస్ సోకిన వారు న్యూమోనియా బారినపడ్తారు. ఇప్పటికే నలుగురు న్యుమోనియా సోకినా వ్యక్తులను వుహాన్ మునిసిపల్ అధికారులు గుర్తించి వారికి చికిత్సనందిస్తున్నారు. వారి ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతానికి నిలకడగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ఈ వైరస్ వాళ్ళ జపాన్ లో కూడా ఒక మరణం సంభవించినట్టు జపాన్ అధికారికంగా ధృవీకరించింది. అధికారులు మాత్రం చైనా వ్యాప్తంగా ఒక 42 మందికి ఈ వైరస్ సోకినట్టు చెప్పినప్పటికీ, దాదాపుగా ఒక 1000 మందికన్నా కనీసంగా సోకి ఉంటుందని, పక్క దేశాల్లో కూడా మరణాలు సంభవిస్తున్నప్పుడు అది అక్కడ కూడా పాకలేదనడానికి గ్యారంటీ ఏంటని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు.
సార్స్ కుటుంబానికి చెందిన ఈ కరోనా వైరస్ సోకగానే మనుషులు న్యుమోనియా బారిన పడుతున్నారు. మరో పక్క నెమో శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ వైరస్ కణాలను సెపెరేట్ చేసి దానికి మందు కనుగొనే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రపంచమంతా ఈ వైరస్ పై అలెర్ట్ ప్రకటించాయి. అమెరికా ఇప్పటికే చైనా నుండి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహిస్తుండగా, మిగిలిన దేశాలు సైతం ఇలా నే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధపడుతున్నారు.
గతంలో సార్లు కూడా చైనాలోనే 2002లో తొలిసారి బయటపడింది. దాన్ని అదుపులోకి తెచ్చేలోపలే 37 దేశాల్లోని దాదాపు 8,000 మందికి సోకింది. ఇప్పుడు ఈ కరోనా వైరస్ కూడా అదే జాతికి చెందినదవడం వల్ల ఆ దిశగా కూడా శాస్త్రవేత్తలు మందు కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇకపోతే చైనా పక్కనే ఉన్న మన దేశం సైతం అప్రమత్తమైంది. చైనాలో ప్రస్తుతం పండగ సీజన్ నడుస్తుంది. అక్కడ ప్రజలు విపరీతమైన ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో భారతదేశం కూడా తగిన చర్యలు చేపట్టేందుకు పూనుకుంటోంది.
ప్రస్తుతానికి వైరస్ ఆదిలోనే ఉన్నందున అంతలా తీవ్రమైన ఎమర్జెన్సీ కండిషన్స్ కూడా అవసరం లేవని సైంటిస్టులు కూడా చెబుతున్నారు.