ఐపీఎల్ షెడ్యూల్ కుప్పిగంతులు: సిక్సర్ కొట్టబోయి డక్ అవుట్?

 ఐపీఎల్ కు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏప్రిల్‌లోనైనా ఐపీఎల్‌ జరుగుతుందా? ఒకవేళ జరిగితే మొత్తమా? కుదించి జరుపుతారా? విదేశీ ఆటగాళ్లు ఉంటారా? ఉండరా? వేదిక భారత్‌ ఆ? లేక మరే దేశంలోనైనా? అనే సందేహాలు ఐపీఎల్‌ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. 

BCCI thinking of conducting IPL in July to September window, But the picture looks grim!

మార్చి 29 న ప్రారంభమవ్వాల్సిన ఐపీఎల్ రెండు వారాలపాటు వాయిదా పడింది. ఏప్రిల్‌-15న ప్రారంభమవుతుందని తొలుత భావించినప్పటికీ... అది ఇప్పుడప్పుడు జరిగేలా కనబడడం లేదు. 

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కష్టాలు ఎలాగుంటాయో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ కు సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏప్రిల్‌లోనైనా ఐపీఎల్‌ జరుగుతుందా? ఒకవేళ జరిగితే మొత్తమా? కుదించి జరుపుతారా? విదేశీ ఆటగాళ్లు ఉంటారా? ఉండరా? వేదిక భారత్‌ ఆ? లేక మరే దేశంలోనైనా? అనే సందేహాలు ఐపీఎల్‌ అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే జులై-సెప్టెంబర్‌ మధ్యలో నిర్వహిస్తే ఎలా ఉంటుందని బీసీసీఐ యోచిస్తోందని తాజా సమాచారం. ఐసీసీ ఫ్యూచర్ ట్రావెల్ ప్లాన్ ప్రకారం సెప్టెంబర్లో ఆసియా కప్‌ ఉంది. 

అదే సమయంలో ఇంగ్లండ్‌లో పాకిస్తాన్‌ పర్యటించనుంది. జూన్‌, జులైలో ఇంగ్లండ్‌ 100 బంతుల టోర్నీని ఆరంభించాల్సి ఉంది. ఇంగ్లండ్‌, పాక్‌ను పక్కన పెట్టినా ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ జట్లకు ప్రత్యేకమైన, ముందుగా నిర్ణయించిన పెద్ద సిరీస్‌లేమీ లేవు. 

Also read: కరోనా దెబ్బకు ధోని విలవిల.... జీవితాంతం క్రికెట్ కు దూరమే!

ఆసియా కప్‌ను మినహాయిస్తే టీ20 ప్రపంచకప్‌ వరకు ఆస్ట్రేలియా, శ్రీలంకతో మాత్రమే భారత్‌ తలపడనుంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో ఐపీఎల్‌ కుదురుతుందో లేదో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి సమాలోచనలు చేస్తున్నాయన్నది తాజా కబురు. 

కాకపోతే గత ఐపీఎల్ లో ప్రపంచ కప్ సన్నాహకాలని విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కీలక దశలో ఆయా జట్లను వదిలి వెళ్లారు. ఇప్పుడు కూడా టి 20 ప్రపంచ కప్ శిబిరాలని గనుక ఏర్పాటు చేస్తే మరోమారు అలానే వారు వదిలి వెళ్లే ఆస్కారం ఉంది. 

ఇక ఐపీఎల్ లో ఒక ప్రధాన ఆకర్షణ విదేశీ ఆటగాళ్లు. ప్రతి ఫ్రాంచైజీలోనూ వారే ప్రధాన ఆకర్షణ, స్టార్ ప్లేయర్లు. ఆస్ట్రేలియాకు చెందిన 17 మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కంగారు టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో భారత్‌ పర్యటనకు వెళ్లటం తగదనీ, ప్రభుత్వం బాధ్యత వహించదనీ, ఏదైనా జరిగితే మీదే బాధ్యత అంటూ ఆటగాళ్లకు కరాఖండిగా చెప్పేసింది. 

తమ దేశ పౌరులకు కోవిడ్‌-19 ప్రబలకుండా చూసుకోవడం తమ బాధ్యతని, అందువల్ల విదేశీ పర్యటనలకు వెళ్లే వారిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశామని ఆస్ట్రేలియా దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ తెలిపారు. 

Also read: ఐపీఎల్ వాయిదా: ప్లాన్ ఇదీ... అనుకున్నది అనుకున్నట్టే!

ఈ మార్గదర్శకాలు వచ్చే నెలలోనూ అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో 17 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో పాల్గొనడం అనుమానమేనని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతకు ముందు క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఆ దేశ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడటానికి నో ఆబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసీ) జారీ చేసింది. 

అయితే, తాజా పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాలపై ప్రభుత్వం తీసుకున్న ఆంక్షలకు అడ్వైజరీ కమిటీ కూడా సంఘీభావం తెలిపింది. ఒకవేళ తమ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడాలనుకుంటే..ఆడొచ్చు.. కానీ ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదనీ, బీమా సదుపాయం కలుగుతుందని ప్రభుత్వం పేర్కొంది. 

ఆస్ట్రేలియా క్రికెటర్ల పరిస్థితి అలా ఉంటే... సఫారీ క్రికెటర్ల పరిస్థితి భారత్‌ నుంచి స్వదేశానికి వచ్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందటంతో భారత్‌, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను తాత్కాలికంగా రద్దు చేసిన విషయం విదితమే. 

తమ దేశానికి చేరుకున్న ఆటగాళ్లు14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటారని ఆ జట్టు ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ షుయబ్‌ మంజ్రా తెలిపారు. వారిలో ఎవ్వరికి లక్షణాలు లేకున్నప్పటికీ...ప్రపంచ దేశాల పరిస్థితులను చూస్తున్న నేపథ్యంలో వారిపైన కూడా ఆంక్షలు విధించే ఆస్కారం లేకపోలేదు. 

ఇదంతా మనం మాట్లాడుకుంటుంది కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాకుండా కనీసం ఒక నెల రోజులు గడిచి, ఉన్న అన్ని కేసులు నయమై ప్రపంచం కరోనా ఫ్రీ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటిస్తే... ఆ తరువాత ఐపీఎల్ జరగడానికి ఆస్కారం ఉంటుంది. 

ప్రస్తుతానికి  వాక్సిన్ ప్రయోగ దశలోనే ఉంది. కాబట్టి వాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది. అంతే కాకుండా ప్రస్తుతం వరకు జరిగిన పరిశోధన మేరకు వైరస్ అతి శీతల ప్రదేశాల్లో కానీ, అతి ఉష్ణ పరిస్థితుల్లో వ్యాపించే ఆస్కారం తక్కువని తెలుస్తుంది. 

ప్రస్తుతం ఎండా కాలం దాదాపుగా వచ్చిన నేపథ్యంలో భారత దేశంపై ఈ వైరస్ ప్రభావం తగ్గిపోయే ఆస్కారం ఉన్నప్పటికీ... శీతల దేశాల్లో ఎండవేడికి వాతావరణం వేడెక్కి ఆహ్లాదంగా మారితే... వైరస్ అక్కడ విజృంభించే ఆస్కారం ఉంటుంది. 

ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎంత మేర తగ్గుతుందనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బీసీసీఐ అనుకుంటున్నా సమాయంతో ఇంకో ప్రమాదం కూడా పొంచి ఉంది. జులై నుంచి సెప్టెంబర్ అనేది భారత దేశంలో రుతుపవనాలు బలంగా ప్రభావం చూపే వర్షా కాలం. 

ఆ సమయంలో గనుక నిర్వహిస్తే వరుణ దేవుడు ఏ మ్యాచ్ కి ప్రత్యేక ఆహ్వానితుడిగా వస్తాడో కూడా తెలియని పరిస్థితి. ఇలా ఇన్ని అడ్డంకుల నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతుందా అనేది ఇప్పుడు అందరి ముందు ఉన్న మిలియన్ డాలర్ల ప్రశ్న. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios