అమరావతి: వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ఈ రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో వ్యూహం ఎలా ఉండాలనేదానిపై అధికార పార్టీ బాగానే గ్రౌండ్ వర్క్ చేసినట్టు మనకు కనబడుతుంది. అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేదానిపై జగన్ మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. 

ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఈ రోజు వైసీపీ తరుపున వాదనలు వినిపించారు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు. తొలుత సబ్ నేషనలిజం అనే కాన్సెప్ట్ ను ముందుకు తీసుకొచ్చి దాని చుట్టూ బలమైన వాదనను బలపరిచి చర్చను నడపడంలో వైసీపీ సఫలీకృతులయినట్టు క్లియర్ గా అక్కడ సాక్షాత్కారమవుతుంది. 

Also read: అప్పట్లో వైఎస్సాఆర్...ఇప్పుడు జగన్: చంద్రబాబుపై ఒకే రకం అస్త్రం

ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో ప్రత్యేకమైన అవసరం ఉంటుందని చెబుతూ ఒక్కో ప్రాంతానికి సంబంధించిన నేత ఆ పేరంతా వెనుకబాటుతనాన్నో, వారి డిమాండునో ప్రాంతానికి ఒక్కరి చొప్పున మాట్లాడారు.

మొదటగా రాయలసీమ వెనుకబాటు గురించి బుగ్గన చాలా లోతుగా ఆ ప్రాంతం ఎంత వెనకబడి ఉందో చెబుతూ అప్పట్లో నెహ్రు అనంతపూర్ కి వచ్చి తాగడానికి గంజికూడా లేకపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న హృదయవిదారక సన్నివేశాన్ని ఉటంకించారు. 

ఆయన రాజధాని అంటే కోటలు ప్రజలకు అవసరం లేదని రాజస్థాన్ లోని రాజవంశాలకు, శ్రీకృష్ణదేవరాయలుకు పోలిక చెప్పారు. ఈ ప్రాంతంలో చెరువుల్లో నీళ్లు అవసరమని, పంటలు పండించుకోవాలని చెబుతూ... రాయలసీమ ప్రాంతానికి వికేంద్రీకరణ ఎందుకు అవసరమో వివరించారు. 

ఇక ఆ తరువాత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ఎంత వెనకబడి ఉన్నదో చెబుతూ తమకు  విశాఖ రాజధాని కావాలని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. దీనిద్వారా అసెంబ్లీ సాక్షిగా విశాఖలో ఎవరు రాజధానిని కోరట్లేదనే ప్రతిపక్ష ఆరోపణలకు చెక్ పెట్టేయొచ్చని వైసీపీ భావించింది. 

Also read: జగన్ కు పొంచి ఉన్న ముప్పు: బిజెపి రాయలసీమ వ్యూహం

ఇలా బొత్స మాట్లాడుతూ... తమ ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుతనాన్ని కూడా చెబుతూ, తమ ప్రాంతంలోని వలసల నుండి మొదలుకొని, నిరక్షరాస్యత వరకు అనేక వాటిపై మాట్లాడారు. 

ఇక ఆ తరువాత గోదావరి జిల్లాల వారి వాయిస్ వినిపించడానికి అన్నట్టు మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. ఆయనకూడా మూడు రాజధానుల ప్రతిపాదనను తమ ప్రాంతవాసులు స్వాగతిస్తున్నట్టు తెలిపారు. 

ఇక ఆ తరువాత అన్నిటికంటే ముఖ్యమైన అమరావతి ప్రాంతం నుండి అన్నట్టు మనగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టయినా సరే...రాష్ట్ర అభివృద్ధే ధ్యేయమని నమ్ముతున్నానని, తమ ప్రాంత ప్రజలంతా దీనికి మద్దతిస్తున్నట్టు అన్నారు.