ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘానా విజయం దిశగా దూసుకుపోతుంది. ఇలా ఈ ఎన్నికల్లో సాధించిన విజయం తో అరవింద్ కేజ్రీవాల్ తనని తాను కేవలం ఢిల్లీ వరకు మాత్రమే పరిమితం చేసుకోదల్చుకోలేదు అనే విషయం మనకు స్పష్టమవుతుంది. 

ఎన్నికల ఫలితాలు దాదాపుగా కేజ్రీవాల్ గెలుస్తాడు అనే విషయం కంఫర్మ్ కాగానే జాతీయ మీడియాలో ఒక యాడ్ ప్రత్యక్షమయింది. రాష్ట్రా నిర్మాణం కోసం ఆప్ తో చేతులు కలాపండంటూ... ఒక నెంబర్ ని డిస్ప్లే చేస్తూ మిస్డ్ కాల్ ఇవ్వండంటూ ప్రకటనను విడుదల చేస్తున్నారు.

Also read; ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్ 

ఖచ్చితంగా కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాడనడం ఖాయంగా కనబడుతుంది. ఇప్పటికే గతంలో కేజ్రీవాల్ మోడీ కి ప్రత్యర్థిగా 2014లో వారణాసిలోని పోటీ చేసాడు. ఆయన అప్పట్లో చేయడానికి వేరే విషయాలను కారణంగా చూపెట్టినప్పటికీ ఆయన జాతీయ రాజకీయాల దృష్టి మాత్రం ఉందనేది ఖచ్చితం. 

పంజాబ్ ఎన్నికల్లో సైతం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తన మార్క్ వేయడానికి ప్రయత్నం చేసాడు. ఢిల్లీని ఆనుకొని ఉండడం, దేశ రాజధానితో దెగ్గర సంబంధాలుండడం ఇతరయాత్రల వల్ల పంజాబ్ లో పోటీ చేసేందుకు కేజ్రీవాల్ ప్రయత్నం చేసాడు. 

20 సీట్లలోనూ గెలిచింది ఆమ్ ఆద్మీ పార్టీ. వచ్చిన ఆ కాంఫిడెన్స్ తో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి దేశ రాజకీయాలపై గట్టిగా కన్ను వేసింది. ఈ గ్యాప్ లోనే అరవింద్ కేజ్రీవాల్  మోడీపై ప్రత్యక్షంగా దాడిని ఎక్కువ చేసారు. 

ఇక ఆ తరువాత పార్లమెంటు ఎన్నికల్లో సైతం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ అవతల ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నం చేసారు. అప్పట్లో హర్యానా , పంజాబ్ లలో ఉన్న స్థానాల్లో కూడా ఓడిపోయారు. 

సిట్టింగ్ స్థానాల్లో ఉన్న వ్యక్తుల్లో కేవలం భగ్వాన్త్ మాన్ మాత్రమే గెలిచాడు. అప్పట్లో కాంగ్రెస్ తో పొత్తు కోసం తీవ్రంగానే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ అది కుదరక పోవడంతో సొంతగానే బరిలోకి దిగారు. 

ఆ తరువాత కేజ్రీవాల్ కి ఒక విషయం మాత్రం అవగతమైంది. మోడీని ఎదుర్కోవాలంటే తొలుత తన సొంత ఇలాఖా ఢిల్లీలో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలనే విషయం మీద వారు దృష్టి సారించారు. 

Also read; పోస్టల్ బ్యాలట్లలో కూడా ఆప్ ఆధిపత్యం.... బీజేపీ ఎందుకు కలవరపడుతుంది?

అందుకోసం ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీతో శత్రుత్వాన్ని పూర్తిగా పక్కకుపెట్టాడు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోడీ నిర్ణయాన్ని స్వాగతించాడు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షహీన్ బాగ్ లో కొనసాగుతున్న నిలపట్ల మౌనం వహించాడు.

ఒకడుగు ముందుకేసి తన చేతిలో గనుక ఢిల్లీ పోలీసు పగ్గాలను పెడితే రెండు నుంచి మూడు ఘంటల్లో ఈ నిరసనలను క్లియర్ చేస్తాననీవు కూడా అన్నాడు. 

ఇలా కేజ్రీవాల్ ఎన్నికలకు ముందు అన్ని జాతీయస్థాయి అంశాలను కూడా పక్కన పెట్టేసాడు. ఆయన కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే పనిచేసాడు, ప్రవర్తించాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన ఢిల్లీ రాజకీయాల పరిధి దాటిపోలేదు. 

మోడీ ఢిల్లీకి ముఖ్యమంత్రి కాదని పదే పదే చెబుతూ సడక్ పని బిజిలి వంటి స్థానిక అంశాలనే ఎన్నికల ప్రధాన అజెండాగా చేసుకొని ముందుకెళ్లాడు. ఇలా ఎన్నికలకు ముందు నేను కేవలం ఢిల్లీ ముఖ్యమంత్రిని మాత్రమే అని చెప్పుకున్న కేజ్రీవాల్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై కన్నేశాడు. 

ఆయన ఇప్పుడు రాష్ట్ర నిర్మాణం వంటి పదాలను వాడుతూ... హనుమాన్ చాలీసా చదవడం ఇతరయాత్రలను కూడా బయటకు ప్రదర్శిస్తున్నాడు. బీజేపీ హిందుత్వ కార్డును న్యూట్రలైజ్ చేయడానికి జై శరీరం అని బీజేపీవారు అంటే.... జై భజరంగబలి అని ఆప్ వారు నినాదాన్ని ఎత్తుకున్నారు. 

ఈ అన్ని విషయాలను బట్టి చూస్తుంటే.... త్వరలో కేజ్రీవాల్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. అది ఇప్పటికిప్పుడు డైరెక్ట్ గాన లేక ఇంకొన్ని రోజుల తర్వాతా అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న.