పెద్ద సైనిక సంస్కరణ.. భారత్ మొదటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ను ఆగస్టులో ప్రకటించే అవకాశం !

integrated theater command: పెద్ద సైనిక సంస్కరణగా పేర్కొన‌బ‌డే మొదటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ ను భార‌త్ ఆగస్టులో ప్రకటించే అవకాశముంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రారంభ దశలో జైపూర్ లో ఉన్న సౌత్ వెస్ట్రన్ కమాండ్ ను ప్రారంభ థియేటర్ కమాండ్ గా గుర్తించనున్న‌ట్టు స‌మాచారం. ఇది ప్రయోగాత్మక ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ గా పనిచేస్తుంది. లోపాలను గుర్తించడానికి, పరిష్కరించడానికి, సవాళ్లను ఎదుర్కొవ‌డానికి, అవసరమైన సర్దుబాట్లను అమలు చేయడానికి బాధ్యతల‌ను క‌లిగి ఉంటుంది.
 

A major military reform, India's first integrated theater command is likely to be announced in August RMA

India's first integrated theater command: పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ తుది దశకు చేరుకున్నందున భారత సాయుధ దళాల మొదటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ (ఐటీసీ) ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించే అవకాశముంది. ఈ చర్య ఇంటర్-సర్వీస్ సినర్జీ,  జాయింట్‌మెన్‌షిప్‌ను పెంచుతుంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన చేసే అవకాశం ఉందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రణాళిక ప్రకారం, జైపూర్ కు చెందిన సౌత్ వెస్ట్రన్ కమాండ్ మొదటి థియేటర్ కమాండ్ గా ఉంటుంది. లోపాలు, సవాళ్లను పరిష్కరించడానికి, తగిన సవరణలను అమలు చేయడానికి టెస్ట్-బెడ్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ గా పనిచేస్తుంది.

సౌత్ వెస్టర్న్ కమాండ్ తర్వాత తదుపరి థియేటర్ కమాండ్ లక్నోకు చెందిన నార్తర్న్ థియేటర్ కమాండ్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడవది కర్ణాటకలోని కార్వార్ కేంద్రంగా పనిచేసే మారిటైమ్ థియేటర్ కమాండ్. తీర, సముద్ర సరిహద్దులను చూసుకోవాల్సిన బాధ్యతలు క‌లిగి ఉంటాయి. 'వన్ బోర్డర్ వన్ ఫోర్స్' కాన్సెప్ట్ ప్రకారం ఈ కమాండ్లను రూపొందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వ్యూహాత్మక, భద్రతాపరమైన భౌగోళిక థియేటర్ల (ప్రాంతాలు) కోసం ఒకే కమాండర్ ఆధ్వర్యంలో త్రివిధ దళాల ఏకీకృత కమాండ్ ను ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ అంటారు. 

స‌రిహ‌ద్దు ర‌క్ష‌ణ చ‌ర్య‌లే ల‌క్ష్యంగా..

పాకిస్థాన్ తో సరిహద్దు ప్రాంతాల రక్షణ, భద్రత బాధ్యతలను వెస్ట్రన్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ నిర్వహిస్తుంది. లక్నో కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ చైనాతో సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఆర్మీ సెంట్రల్ కమాండ్ ఉంది. ప్రణాళిక ప్రకారం అదనపు పోస్టులు, ర్యాంకులు ఉండవు. ఇప్పటికే ఉన్న కమాండ్ స్ట్రక్చర్ల నుంచి వీటిని తీసుకోనున్నారు. ప్రస్తుతం భారత సాయుధ దళాలకు 17 కమాండ్లు ఉండగా, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ఫోర్స్ కు చెరో 7 కమాండ్లు ఉండగా, భారత నావికాదళానికి మూడు కమాండ్లు ఉన్నాయి.

మొదటి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండర్..?

తొలి ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండర్ ను ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. సీనియారిటీ సూత్రం ప్రకారం కోల్ క‌తా కేంద్రంగా పనిచేసే ఈస్టర్న్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఆర్పీ కలితా ఆగస్టులో నియామకానికి ముందువ‌రుస‌లో ఉన్న సీనియర్ అధికారి. మరో ఆప్షన్ ప్రస్తుత సౌత్ వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బీఎస్ రాజు.

ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండర్ పదవీలో ఎప్ప‌టివ‌ర‌కు ఉంటారు..?

ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండర్ పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలుగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సర్వీసెస్ చీఫ్లు మూడేళ్లు లేదా 62 ఏళ్ల వయస్సు వరకు పనిచేస్తారు. లెఫ్టినెంట్ జనరల్, తత్సమాన ర్యాంకుల అధికారులు ప్రస్తుతం 60 ఏళ్లకే పదవీ విరమణ పొందుతారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios