న్యూయార్క్: స్టూడెంట్ వీసాపై అమెరికాలో ఉన్న ఓ భారత విద్యార్థికి మైనర్ తో కామవాంఛ తీర్చుకున్నందుకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సంఘటనలో అతను దోషిగా తేలినట్లు ప్రాసిక్యూటర్స్ తెలిపారు. 

సచిన్ అజి భాస్కర్ అనే భారతీయుడు ఆ ఘటనలో దోషిగా తేలాడు. మైనర్ తో శృంగారంలో పాల్గొన్న విషయాన్ని అతను సీనియర్ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి విలియమ్ ఎం స్క్కెట్నీ ముందు అంగీకరించాడు. 

ఈ నేరం చేసిన వ్యక్తికి అత్యధికంగా జీవిత ఖైదు, అత్యంత కనిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడుతుంది. 250,000 అమెరికా డాలర్ల జరిమానా లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉందని యూఎస్ అటార్నీ జేమ్స్ పి. కెన్నెడీ చెప్పారు. 

శృంగారంలో పాల్గొనాలని చెప్పి భాస్కర్ 11 ఏళ్ల బాలికకు టెక్ట్స్, ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు ప్రాసిక్యూటర్స్ ఆరోపించారు. ఆ సంఘటన 2018 ఆగస్టులో జరిగినట్లు చెప్పారు జూన్ 17వ తేదీ అతనికి జైలు శిక్ష ఖరారవుతుంది.