ఆల్ రౌంటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్ టెస్టులో విఫలమయ్యాడు. నిషేధిత డ్రగ్ టెర్బుటలైన్ ని పఠాన్ స్వీకరించినట్లు తేలింది. దీంతో.. యూసూఫ్ పై బీసీసీఐ నిషేధం విధించింది. కాగా.. ఆ నిషేధం జనవరి 14వ తేదీతో ముగియనుంది. ఈ విషయాన్ని పఠాన్ స్వయంగా ట్విట్టర్ వేధికగా తెలియజేశాడు.

వివరాల్లోకి వెళితే.. గతేడాది మార్చిలో దేశవాలీ టీ20 మ్యాచ్ లో భాగంగా డోపింగ్ టెస్టు నిమిత్తం పఠాన్ నుంచి యూరిన్ శాంపిల్స్ సేకరించారు. కాగా.. అందులో పఠాన్ పట్టుపడ్డాడు. అతను నిషేధిత డ్రగ్ తీసుకున్నాడని దీంతో.. పఠాన్ కి 5 నెలల పాటు మ్యాచుల్లో ఆడకుండా నిషేధం విధిస్తున్నట్లు అప్పుడు బీసీసీఐ ప్రకటించింది. అనంతరం విచారణలో పఠాన్ కావాలని ఆ డ్రగ్ తీసుకోలేదని.. దగ్గుమందు తీసుకుంటే.. అందులో ఆ డ్రగ్ ఉందని తేలింది.

నేరం రుజువైతే.. సస్పెన్షన్ ని పొడిగించాలని బీసీసీఐ భావించింది. కానీ.. అది పఠాన్ ఉద్దేశపూర్వకంగా చేసిన  తప్పుకాదని తేలడంతో.. సస్పెన్షన్ పొడిగించాల్సిన అవసరం రాలేదు. ఆగస్టు 15 నుంచి సస్పెన్షన్ ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. ఈ నెల 14తో ముగియనున్నట్లు తెలిపింది.