ఆత్మాభిమానం దెబ్బతిన్నదట..!( వీడియో)

First Published 27, Nov 2017, 11:14 AM IST
YSRCP MLA Giddi Eswari joins TDP
Highlights
  • టీడీపీలో చేరిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
  • తన శ్రమను ప్రతిపక్ష నేత గుర్తించలేదన్న ఈశ్వరి

‘‘నా ఆత్మాభిమానం వైసీపీలో దెబ్బతిన్నది’’ ఇది పార్టీ ఫిరాయించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్యలు. సోమవారం ఉదయం ఆమె టీడీపీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు సమక్షంఆ లో ఆ పార్టీలో చేరారు. టీడీపీ పార్టీ కండువా కప్పి.. ఆమెను చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ నేపథ్యంలో గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ.. వైసీపీలో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం, గిరిజనుల సంక్షేమం కోసం తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. పార్టీని బలోపేతం చేసేందుకు తాను పడిన శ్రమను వైసీపీ అధినేత జగన్ గుర్తించలేదని వాపోయారు. హుద్ హుద్ తుఫాను తర్వాత విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతోగానో కృషి చేశారన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారినట్లు ఆమె ప్రకటించారు.

ఈశ్వరితోపాటు 60మంది ఎంపీటీసీలు, పలువురు సర్పంచులు కూడా టీడీపీలోకి చేరారు. ఈశ్వరితో కలిసి ఇప్పటి వరకు 23మంది ఎమ్మెల్యేలు , ముగ్గురు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. ఇదిలా ఉండగా మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

loader