Asianet News TeluguAsianet News Telugu

యూట్యూబ్ లో పదివేల ఉద్యోగాలు

  • ఇంతకీ ఉద్యోగం ఏమిటో తెలుసా..? యూజర్లను తప్పుదోవ పట్టిస్తూ, ఉగ్రవాదం ప్రోత్సహించేలా ఉన్న వీడియోలను గుర్తించి వాటిని తొలగిండమే పని.
YouTube boss to counter extremist and violent content with 10000 staf

యూట్యూబ్ లో పదివేల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఇంతకీ ఉద్యోగం ఏమిటో తెలుసా..? యూజర్లను తప్పుదోవ పట్టిస్తూ, ఉగ్రవాదం ప్రోత్సహించేలా ఉన్న వీడియోలను గుర్తించి వాటిని తొలగిండమే పని.

‘కొన్ని వీడియోలు యూజర్లను తప్పుదోవ పట్టించేలా, ప్రజలకు హాని కలిగించేలా ఉంటున్నాయి. మరికొన్ని చిన్నారులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాంటి వాటిని పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకునేందుకు 2018లో 10వేల కొత్త నియామకాలు చేపడుతున్నాం’ అని గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సూసన్‌ వోజికి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకు కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించేందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌, ట్విటర్‌ చర్యలు చేపట్టాయి. తాజాగా యూట్యూబ్‌ కూడా ఆ జాబితాలో చేరింది. అంతేగాక చిన్నారులపై ప్రభావం చూపేలా ఉండే వీడియోలను తమ డేటాబేస్‌ నుంచి తొలగిస్తున్నట్లు గత నెలలో ప్రకటించింది. ‘కొన్ని వీడియోలు పెద్దలు మ్రాతమే చూసేలా ఉంటాయి. మరికొన్ని అస్సలు ఆమోదయోగ్యంగా ఉండవు. అలాంటి వాటిని తొలగించేందుకు మేం పనిచేస్తున్నాం’ అని యూట్యూబ్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జోనా రైట్‌ అన్నారు. యూట్యూబ్‌ ఇప్పటికే 50 ఛానళ్లు, వేలసంఖ్యలో వీడియోలు, 5లక్షల అభ్యంతరకర యాడ్‌లను తమ డేటాబేస్‌ నుంచి తొలగించింది. అంటే ఇక నుంచి యూట్యూబ్ లో ఏది పడితే అది పోస్టు చేయలేమన్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios