గుంతకల్ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆనంతపురం ఆర్ డి వొ కార్యాలయం ఎదుట గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి ఆధ్వర్యంలో 48 గంటల దీక్షలు మొదలు పెట్టారు.

  రాజకీయపార్టీలు ఈ  డమాండ్ ను ఖాతరు చేయకపోయినా, యువకులు, విద్యార్థులు మాత్రం రాయలసీం ప్రాంతీయ సమస్యలను అన్ని జిల్లాల్లో  చర్చలో  ఉంచుతున్నారు. కడప జిల్లా ఉక్కుఉద్యమానికి కేంద్రమయితే అనంతపురం జిల్లాలో గుంతకల్ రైల్వే జోన్  ఉద్యమం మొదలయింది. జిల్లాకు చెందిన యువకులు రైల్వే జోన్ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమం ప్రారంభించారు. ఇపుడు దీక్ష జరుపుతున్నారు. ఇపుడిది నిప్పురవ్వగానే కనిపించవచ్చు. అయితే, సమయమొచ్చినపుడు అంటుకుంటుందని పార్టీ లు విస్మరించరాదు.

నిన్నటి నుంచి   రైల్వే జోన్ సాధన సమితి కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి అధ్యక్షతన దీక్షలు జరుగుతున్నాయి. మాజీ ఎంఎల్ సి  గేయానంద్ దండలు వేసి ఉద్యమాన్ని ప్రారంభించారు.ఈ  సంధర్భంగా నాయకులూ మాట్లాడుతూ తక్షణం వెనకబడిన ప్రాంతంలోని కీలమయిన జంక్సన్, రైల్వే డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయిన  గుంతకల్ కేంద్రంగా రైల్వే జోన్  ప్రకటించాలని డిమాండ్ చేశారు. అలా కాని  పక్షంలో రాయలసీమ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని వారు హచ్చరించారు.

కర్ణాటక కు రైల్వే జోన్ మంజూరు చేసినపుడు అక్కడి రాష్ట్రం ఎంత విజ్ఞతతో వ్యవహరించింద్ అలాగేఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వెనకబడిన ప్రాంతానికి జోన్ కేటాయించాలని వారు పేర్కొన్నారు. కొత్త రేల్వే జోన్ ను రాజధాని బెంగుళూరులో ఏర్పాటు చేయకుండా వెనకబడిన ప్రాంతమయిన హుబ్లీకి కేటాయించిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అన్ని విధాల అభివృద్ధి చేందిన,రాష్ట్రానికి ఫైనాన్సియల్ క్యాపిటల్ గా పేరున్న విశాఖపట్నానికి రైల్వే జోన్ కేటాయించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.దేశంలోనే అత్యల్ప వర్షాభావ ప్రాంతం అయిన అనంతపురం జిల్లాకు జోన్ టాయించం న్యాయమని అన్నారు.

దీక్షలో రైల్వే జోన్ సాధన సమితి నాయకులు రాజ శేఖర్ రెడ్డి,తిప్పిరెడ్డి నాగార్జున రెడ్డి,అశోక్,సీమ కృష్ణ,రాజేంద్రప్రసాద్, శివ రాయల్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఈ దీక్షకు సంఘీభావంగా సమాజ్ వాడి ఫార్వర్డ్ బ్లాకు అధ్యక్షుడు అలీ అహమ్మద్,కిరణ్,ఇండ్లప్రభాకర్ రెడ్డి,కొర్రీ చంద్రశేఖర్,రైల్వే మాజ్దుర్ నాయకుడు శ్రీధర్,నాగరాజు,ప్రొఫెసర్ సదాశివ రెడ్డి, సమాచార హక్కు ప్రచార ఐక్య వేదిక నాయకుల శ్రీనివాసులు రెడ్డి తదితరులు కూడా దీక్షలో పాల్గొన్నారు