ఒంటరిగా ఉంటున్న ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు బండరాళ్ళతో కొట్టి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఈ దారుణ హత్య తో హయత్ నగర్ లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ హత్యకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన  అనుషా 2016లో బీటెక్ పూర్తి చేసింది. ఇంజనీరింగ్ పూర్తవడంతో హైదరాబాద్ కు వచ్చిన అనూష గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో హయత్ నగర్ లో ఒంటరిగా అద్దెకుంటోంది. ఈ యువతి బీటెక్ చదువుకునే రోజుల్లోనే ఓ యువకుడిని ప్రేమించింది.  వీరి ప్రేమను ఇద్దరి తల్లిదండ్రులను ఒప్పుకోడంతో 8 నెలల క్రితం నిశ్యితార్థం అయ్యింది. మరో మూడు నెలల్లో వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నట్లు సమాచారం. ఇంతలోనే ఆమెను కొందరు దుండగులు బండరాళ్లతో మోది హత్య చేశారు.  

విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకున్నారు. యువతిని ఇంత దారుణంగా ఎవరు హత్య చేసి ఉంటారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.