ముక్కూ మొహం తెలియని యువకుడితో చేసిన ఫేస్ బుక్ స్నేహం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. కేవలం ఫేస్ బుక్ పరిచయంతోనే యువతిని లొంగదీసుకోవాలని ప్రయత్నించి, అది సాధ్యం కాకపోడంతో దారుణంగా హత్య చేశాడో మృగాడు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబై లో చోటుచేసుకుంది.

ముంబైలోని వాసి ప్రాంతానికి చెందిన అంకిత (20) న‌ల‌సోపార ప్రాంతానికి చెందిన హ‌రిదాస్‌కు ఫేస్‌బుక్ ద్వారా కొన్ని నెల‌ల క్రితం ప‌రిచ‌య‌మైంది. తరచూ చాటింగ్ చేసుకుంటూ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు.దీన్ని అదునుగా తీసుకున్న హరిదాస్ యువతిని ఎలాగైనా అనుభవించాలని బావించాడు. ఇందుకోసం  అంకితను నేరుగా క‌లుద్దామ‌ని ప్రపోజ్ చేశాడు. అతడి ఆలోచన తెలీని అంకిత అతడ్ని కలవడానికి అంగీకరించింది. ఇందుకోసం అంకిత ఆదివారం సాయంత్రం న‌ల‌సోపార‌లోని హరిదాస్ ఫ్లాట్‌కి వెళ్లింది. ఫ్లాట్‌లో ఒంటరిగా దొరికిన అంకితను అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు హరిదాస్. దీనికి ఆమె నిరాక‌రించడంతో ఆగ్ర‌హానికి లోనైన హ‌రిదాస్ షూ లేస్‌ను ఆమె గొంతుకు బిగించి హత్య చేశాడు. 

యువతి శవాన్ని అపార్ట్ మెంట్ మెట్లపై పడేసి హరిదాస్ పరారయ్యాడు. ఈ శవాన్న గమనించిన అపార్ట్ మెంట్లోని కుటుంబాలు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హరిదాస్ ను అరెస్ట్ చేసిన పోలీసులు విచారించగా ఆమె సెక్స్‌కు నిరాక‌రించింద‌న్న కోపంతోనే చంపానని అంగీకరించాడు. అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. 

అపరిచితులతులతో  సోషల్ మీడియా స్నేహాలు ఇలా ప్రమాదాలకు దారితీస్తున్నాయని, వీటి పట్ల యువత విచక్షణతో ఆలోచించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.