రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ అతి శుభవార్త తెలియజేసింది. సాధారణంగా ట్రైన్ లో ఊరు వెళ్లాలి అనుకునే వాళ్లు టికెట్లు ముందుగా బుక్ చేసుకోవడం సర్వసాధారణం. చివరి నిమిషంలో వెళ్లడం కుదరక క్యాన్సిల్ చేసుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అయితే.. ఆ క్యాన్సిలేష
న్ కూడా కొంత సమయమే ఉంటుంది. లేదా.. క్యాన్సిలేషన్ మనీ పూర్తి రాకపోవడం లాంటివి ఉంటాయి. అయితే.. ఇక నుంచి ఆ సమస్య లేదు. మీరు ఊరికి వెళ్లడం క్యాన్సిల్ అయితే.. ఆ టికెట్ ని మరొకరికి ట్రాన్సఫర్ చేయవచ్చు.

కాగా.. దీనిలో చిన్న లిటికేషన్ ఉంది. టికెట్ ని వేరేవాళ్ల పేరు మీదకి ట్రాన్స ఫర్ చేయచ్చు. కాకపోతే ఎవరికి పడితే వాళ్లకు చేయడానికి వీలు ఉండదు. మీ కుటుంబంలోని వ్యక్తులకు మాత్రం సులభంగా చేయచ్చు. రైలు స్టేషన్ లో స్టార్ట్ అవ్వడానికి 24గంటల ముందు స్టేషన్ లో ఉండే చీఫ్ రిజర్వేషన్ సూపర్ వైజర్ కి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది.

ఒకే కుటుంబానికి చెందిన వారికి కాకుండా ఇతరులకు కూడా టికెట్ ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంది. కాకపోతే అది స్టూడెంట్స్ కి వర్తిస్తుంది. ఒకే కాలేజీకి చెందిన వారు అయితే.. ప్రిన్సిపల్ నుంచి లేఖ తీసుకువస్తే.. ఒక విద్యార్థి టికెట్ మరొకరికి మార్చే అవకాశం ఉంది.