గడ్డకట్టే చలిలో.. ఈ ఇద్దరుఅమ్మాయిలు ఏంచేస్తున్నారో తెలుసా?

గడ్డకట్టే చలిలో.. ఈ ఇద్దరుఅమ్మాయిలు ఏంచేస్తున్నారో తెలుసా?

ఘుమఘుమలాడే బిర్యానీ అందరూ చేస్తారు. అయితే, ఒక్కొక్కరి ఇంట్లో లేదా వూర్లో లోకల్ టేస్టు కలసిపోయి, కొత్త బిర్యానీ తయావుతుంది. ఏ రెండు బిరియానీలు ఒకలాగా ఉండక పోవడానికి కారణం ఇదే. ఇలాగే ఇపుడు యోగా అనే మాట ప్రపంచమంతా వినబడుతూ ఉంది. ఐక్యరాజ్యసమితి యోగా డే ని ప్రకటించింది. అయితేయోగా రకరకాల వేషాలు వేసుకుంటూ ఉంది. ఆస్ట్రేలియాలో బీరు యోగా వచ్చింది. ఇపుడు మైనస్ 41 డిగ్రీయోగా మొదలైంది. పైన ఫోటోలో ఇద్దరు అమ్మాయిలు చేస్తున్నది.. ఈ మైనస్ 41డిగ్రీ యోగానే.

 

ఈ కొత్తరకం యోగాని కనిపెట్టింది కూడా ఈ ఇద్దరు అమ్మాయిలే. ఇంట్లో.. లేదా ఒక గదిలో యోగా చేస్తే కిక్కు ఏమి ఉంటుంది..? అందుకే.. అవుట్ సైడ్ యోగా చేయాలని డిసైడ్ అయ్యారు. అందులోనూ ఎంతో కొంత భిన్నత్వంగా ఉండాలని భావించారేమో.. మైనస్ 41డిగ్రీస్ వద్ద.. ఎముకలు కొరికే చలిలో యోగా చేయడం ప్రారంభించారు. రష్యాలోని ప్రముఖ ట్రైన్ హబ్.. టిండా, రష్యాలోని డైమండ్ రీజియన్ ని వీరిద్దరూ అడ్డాగా మార్చుకున్నారు. అంతే.. ఆ ప్రాంతంలో యోగా చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి మైనస్ 41 డిగ్రీల యోగా.. ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. యోగా చేస్తున్న విధానాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు వారు చెప్పడం విశేషం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos