చిత్తూరులో విదేశీ విద్యార్థి ఆత్మహత్య

First Published 19, Feb 2018, 1:36 PM IST
yemen student suicide at chittoor
Highlights
  • చిత్తూరులో  యెమెన్ దేశ విద్యార్థి ఆత్మహత్య
  • ఇంజనీరింగ్ చేయడానికి ఇండియాకి వచ్చిన విద్యార్థి

 

ఉన్నత చదువుల కోసం ఇండియాకి వచ్చిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. యెమెన్ దేశానికి చెందిన ఖలెద్‌ మహమద్‌ ఒత్‌మాన్‌ నయీఫ్‌ అనే విద్యార్థి చిత్తూరులోని తన గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో చిత్తూరు పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  

ఈ విదేశీ విద్యార్థి ఆత్మహత్యకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. యెమెన్ దేశానికి చెందిన ఖలెద్‌ మహమద్‌ ఒత్‌మాన్‌ నయీఫ్‌  2014లో ఆ దేశ ప్రభుత్వ ఉపకార వేతనంపై చదువుకోడానికి ఇండియాకి వచ్చాడు. ఇక్కడ చిత్తూరు నగర శివారులోని శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడు యెమెన్ కు చెందిన మరో విద్యార్థి హషీమ్‌ అల్‌-షబితో కలిసి ఓ అద్దె గదిలో ఉంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని ఇండియాకు తీసుకొచ్చిన ఖలెద్‌ కేరళలో వైద్యం చేయించాడు. అయితే ఇటీవలే అతడి మిత్రుడు కేరళకు వెళ్లగా.. తన తల్లికి సైతం అక్కడి నుంచి మందులు తీసుకురావాలని కోరాడు. 


అయితే శనివారం కేరళకు వెళ్లిన ఆ మిత్రుడు ఏం మందులు కావాలో కన్నుకోడానికి ఖలెద్ కు ఫోన్‌ చేశాడు. అతడు ఎంతకీ ఫోన్ లిస్ట్ చేయకపోవడంతో  మరో స్నేహితునికి ఫోన్‌చేసి గదిని పరిశీలించాలని కోరాడు. అతడు వెళ్లి ఆ గదిలోకి వెళ్లి చూడగా  ఖలెద్ శవమై పడి ఉండటాన్ని గమనించాడు. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.

loader