పసిడి ధర రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో భారీగా తగ్గిన బంగారం ధర.. నూతన సంవత్సరంలో పరుగులు పెడుతోంది. కేవలం నెల రోజుల్లో పదిగ్రాముల పసిడి ధర రూ.1130 పెరిగింది. గతేడాది డిసెంబర్ 23వ తేదీన పదిగ్రాముల బంగారం(22క్యారెట్స్) రూ.27,650 ఉండగా.. జనవరి 23వ తేదీన రూ.28,780గా ఉంది. మరోవైపు జనవరి 20వ తేదీతో పోలిస్తే మాత్రం.. నేటి మార్కెట్ లో బంగారం ధర రూ.60తగ్గింది. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.28,780గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు..

22క్యారెట్ల విలువగల 10గ్రాముల బంగారం ధర హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ.28,780గా ఉంది. ఇక 24క్యారెట్ల పదిగ్రాముల బంగారం ధర .. ఈ మూడు నగరాల్లోనూ రూ.31,396గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే.. మూడు నగరాల్లోనూ కేజీ వెండి ధర రూ.42వేలుగా ఉంది. బంగారంలో హెచ్చు తగ్గులు వస్తున్నా.. వెండి మాత్రం నిలకడగా కొనసాగుతోంది.