కర్ణాటక ముఖ్యమంత్రిగా పూర్తిస్థాయిలో ప్రజలను పరిపాలించే అదృష్టం లేనట్టుంది. గజినీ మహ్మద్  దండయాత్ర లాగా ఇప్పటికి ఆయన సీఎం పదవి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే.. ఆయన 
ప్రతయ్నతించిన మూడుసార్లు సీఎం పదవి అందినట్టే అంది.. మళ్లీ దూరమైంది. తొలిసారి ఆయన 2007లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ.. కేవలం 8 రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగారు.

ఆ తర్వాత అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 2008లో మరోసారి ప్రయత్నించారు. అప్పుడు మూడు సంవత్సరాల పైనే సీఎంగా కొనసాగారు. అయితే.. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
దీంతో తప్పని పరిస్థితుల్లో తన సీఎం పదవికి రాజీనామా చేశారు.

చివరగా 2018లోనూ ఆయన బీజేపీ నుంచి సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. కాంగ్రెస్, జేడీఎస్ లతో పోలిస్తే.. బీజేపీ మెజార్టీ సీట్లు కూడా సంపాధించింది. అయితే.. మ్యాజిక్ ఫిగర్ ని మాత్రం చేరుకోలేకపోయింది. ఇక జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీకే గవర్నర్ ఛాన్స్ ఇచ్చారు. అంతే.. వెంటనే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కేవలం 7గురు సభ్యులు తమ  పార్టీలో చేరి ఉంటే.. యడ్యూరప్ప సీఎంగా కొనసాగేవారు. ఆ ఏడుగురి కోసం కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడంలో ప్రయత్నించి విఫలమయ్యారు. 

విశ్వాస పరీక్ష పెట్టకముందే.. తన సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో... మరోసారి ఆయన తన పదవిని వదులుకున్నారు. ఈసారి ఆయన 55గంటలు మాత్రమే కర్ణాటక సీఎంగా విధులు నిర్వర్తించారు. ఇలా మూడోసారి యడ్యూరప్ప సీఎం పదవి దక్కించుకోవడంలో ఫెయిల్ అయ్యారు.