రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం

కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్ప నేడు (గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో ఉదయం 9 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణస్వీకారంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో లైన్‌క్లియర్‌ అయిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారోత్సవం కోసం రాజ్‌భవన్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భాజపా 104 సీట్లు, కాంగ్రెస్‌ పార్టీ 78, జేడీఎస్‌ 36 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల నాటకీయ పరిణామాల తర్వాత అతిపెద్ద పార్టీ అయిన భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఆహ్వానించారు. దీంతో ఈరోజు ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.