అమిత్ షాకు యడ్యూరప్ప ఫోన్: రాజీనామాకు ఆదేశాలు?

Yeddyurappa speaks with Amit Shah on phone
Highlights

విశ్వాస పరీక్షలో నెగ్గడం కష్టమని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు: విశ్వాస పరీక్షలో నెగ్గడం కష్టమని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం 4 గంటలకు యడ్యూరప్ప విశ్వాస తీర్మానం ప్రతిపాదించాల్సి ఉంది. అయితే, దానికి ముందే యడ్యూరప్ప రాజీనామా చేస్తారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

బలనిరూపణ సాధ్యం కాకపోవచ్చునని భావించిన యడ్యూరప్ప బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఫోన్ చేసినట్లు చెబుతున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫోన్ నుంచి అమిత్ షాకు ఆయన ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. 

భోజన విరామం కోసం వాయిదా పడిన శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ్యులతో ప్రోటెం స్పీకర్ బోపయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. యడ్యూరప్ప బలనిరూపణకు కొద్ది నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది.

బిజెపి సాగిస్తున్న బేరసారాలను కాంగ్రెసు నేతలు పకడ్బందీగా ట్రాక్ చేసి బయటపెడుతున్నారు. ఈ నేపథ్యంలో బలాన్ని సమీకరించుకోవడం కష్టమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాజీనామా చేయాల్సిందిగా అధిష్టానం నుంచి యడ్యూరప్పకు ఆదేశాలు వచ్చినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

loader