నేరుగా యడ్యూరప్పనే బేరసారాలు: ఆడియో విడుదల చేసిన కాంగ్రెసు

Yeddyurappa's audio released by Congress
Highlights

బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాసారాలు ఆడుతున్న వైనాన్ని కాంగ్రెసు నాయకులు ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు.

బెంగళూరు: బిజెపి తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరాసారాలు ఆడుతున్న వైనాన్ని కాంగ్రెసు నాయకులు ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. తాజాగా, ముఖ్యమంత్రి యడ్యూరప్ప నేరుగా కాంగ్రెసు శాసనసభ్యుడు బీసీ పాటిల్ తో జరిపిన బేరసారాల ఆడియోను కాంగ్రెసు విడుదల చేసింది.

పాటిల్‌‌కు మంత్రి పదవి ఇస్తామంటూ యడ్యూరప్ప హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గాలి జనార్థన్ రెడ్డి కొంతమందితో జరిపిన బేరసారాల ఆడియోను ఇప్పటికే కాంగ్రెసు బయటపెట్టిన విషయం తెలిసిందే. శనివారం యడ్యూరప్ప బేరసారాలు కొనసాగించిన ఆడియో విడుదల అయింది.
 
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌తో యడ్యూరప్ప ఫోన్ సంభాషణ ఇలా సాగింది...

యడ్యూరప్ప: మంత్రి పదవితో పాటు రూ.5 కోట్లు ఇస్తా
పాటిల్ : ఇక ముందు నా పొజిషన్ ఏంటి?
యడ్యూరప్ప: నువ్వు మంత్రి అవుతావు
పాటిల్ : నాతో పాటు ఇద్దరు..ముగ్గురు ఉన్నారు
యడ్యూరప్ప: నీ వెంట ఉన్న వారిని కూడా తీసుకొని రా.. నాపై విశ్వాసం ఉంది కదా, ఒకసారి కొచ్చి వెళ్తే ఇక దొరకవు..
పాటిల్ : అది జరగని విషయం
యడ్యూరప్ప: ఇంట్లో వాళ్లకి సమస్య ఉందని వెనక్కి వచ్చేయ్‌
పాటిల్ : ఐదు నిమిషాల్లో మీకు ఫోన్‌ చేసి చెప్తా.
యడ్యూరప్ప: శ్రీరాములుకు ఫోన్‌ చేసి చెప్పు

యడ్యూరప్పతో పాటు ఎమ్మెల్యే బి. శ్రీరాములు, బిజెపి నేత మురళీధర్ రావు బేరసారాలు ఆడినట్లు కాంగ్రెసు ఆరోపిస్తోంది. యడ్యూరప్ప ఆడియో టేపుతో పాటు బి. శ్రీరాములు, మురళీధర్ రావు టేపులను కూడా కాంగ్రెసు విడుదల చేసింది.

loader