అసెంబ్లీలో భావోద్వేగం: గవర్నర్ చేతికి యడ్యూరప్ప రాజీనామా లేఖ

అసెంబ్లీలో భావోద్వేగం: గవర్నర్ చేతికి యడ్యూరప్ప రాజీనామా లేఖ

బెంగళూరు: బలనిరూపణకు సిద్ధపడకుండానే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనాామా చేస్తున్నట్లు యడ్యూరప్ప ప్రకటించారు. ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప శాసనసభలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. శాసనసభలో ఆయన ప్రసంగించారు. బలపరీక్షకు సిద్ధపడకుండానే యడ్యూరప్ప రాజీనామా చేశారు.

ఎన్నికల్లో భారీ యెత్తున ప్రచారం చేశానని యడ్యూరప్పర చెప్పారు బిజెపికి మద్దతిచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు అని అన్నారు. ప్రజలు కాంగ్రెసు దుష్పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారని అన్నారు.

మోడీ, అమిత్ షా తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారని ఆయన చెప్పారు. ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రజా సేవ చేసే అవకాశం దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ప్రజాభిప్రాయానికి విరుద్దంగా కాంగ్రెసు, జెడిఎస్ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నించడం దురదృష్టకరమని అన్నారు. 

గత ఐదేళ్లుగా సిద్ధరామయ్య మొండి నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన నిర్ణయాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని యడ్యూరప్ప అన్నారు. రైతులకు మంచి చేద్దామని అనుకున్నానని అన్నారు. సిద్ధరామయ్య ప్రజలను కన్నీళ్లు పెట్టించారని అన్నారు. ప్రజల కన్నీళ్లు తూడుద్దామని అనుకున్నానని ఆయన అన్నారు.

యడ్యూరప్ప తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. లక్షన్నర లోపు రైతుల రుణాలను మాఫి చేద్దామని అనుకున్నాని, ఆదర్శ రాష్ట్రంగా కర్ణాటకను తీర్చి దిద్దుదామని అనుకున్నానని ఆయన చెప్పారు. తాను చేయాలనుకున్న పనులేవీ చేయడం సాధ్యం కావడం లేదని అన్నారు.

అసెంబ్లీ గ్యాలరీ నుంచి బిజెపి నేతలు ప్రకాశ్ జవదేకర్, మురళీధర్ రావు బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెసు సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, శోభ, తదితరులు గ్యాలరీలో కూర్చుని శాసనసభా కార్యక్రమాలను వీక్షించారు.

సుప్రీంకోర్టు తీర్పు మేరకు యడ్యూరప్ప శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది. కానీ అవసరం లేకుండానే శాసనసభ సమావేశం శనివారం ముగిసింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page