యడ్యూరప్ప రాజీనామా: ఆమోదించిన స్పీకర్

Yeddyrappa resigns as MP, speaker accepts
Highlights

తమ పార్లమెంటు సభ్యత్వాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు ఎమ్మెల్యే బి. శ్రీరాములు రాజీనామాలు చేశారు.

బెంగళూరు: తమ పార్లమెంటు సభ్యత్వాలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో పాటు ఎమ్మెల్యే బి. శ్రీరాములు రాజీనామాలు చేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడంతో వారు లోకసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప ప్రస్తుతం షిమోగా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బళ్లారి రూరల్ శాసనసభ స్థానం నుంచి గెలిచిన శ్రీరాములు ప్రస్తుతం బళ్లారి లోక్‌సభ ఎంపీగా కొనసాగుతున్నారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ఇద్దరి చేత కూడా శనివారం ప్రొటెం స్పీకర్ బోపయ్య శాసన సభ్యులుగా ప్రమాణం చేయించారు. 

శనివారం సాయంత్రం యడ్యూరప్ప కర్ణాటక శాసనసభలో బలపరీక్షకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

loader