బండ్ల గణేష్ ను అరెస్టు చేయండి, బుద్ధి చెప్పండి

బండ్ల గణేష్ ను అరెస్టు చేయండి, బుద్ధి చెప్పండి

 

వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజాపై ఒక నాటి కమెడియన్ బండ్లగణేష్ అనుచిత వ్యాఖ్యు చేయడానికి వ్యతిరేకంగా   విజయవాడ కార్పొరేషన్ ప్రతిపక్షనాయకురాలు, బండి పుణ్యశీల మండి పడ్డారు. ఒక మహిళ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేసిన  బండ్ల గణేష్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు విజయవాడ పోలీస్‌ కమీషనరేట్‌లో ఆమె సహచర కార్పొరేటర్లతో కలసి ఫిర్యాదు చేశారు. విజయవాడ నగర పోలీస్ కమీషనర్ గౌతమ్ సవాంగ్ ను కలిసిన వైసీపీ మహిళ కార్పొరేటర్లు ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు.

 

రెండు రోజుల కిందట వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కె  రోజాపై ఒక ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బండ్ల రాసేందుకు కూడా వీలుకానంత అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా స్పందించింది.. బండ్ల గణేష్ ప్రవర్తన మీద పుణ్యశీల తీవ్రంగా స్పందించారు.  బండ్ల గణేష్‌ కు ఆంధ్రా రాజకీయాలతో అసలు అవసరం ఏంటని? ప్రశ్నించారు. మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కాదు,  దమ్ముంటే విజయవాడ వచ్చి మాట్లాడాలని వైసిపి నేత సవాల్‌ విసిరారు. ఒక మహిళా నేతపై సంస్కారం మరచిపోయి అసభ్యపదజాలం వ్యాఖ్యలు చేయటం క్షమించరానిదని అంటూ  తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలని విజయవాడ పోలీసులను ఆమె కోరారు. 

 

ఇవి కూడా చదవండి

లైవ్ షోలో బూతులు తిట్టుకున్న రోజా, బండ్ల గణేష్

https://goo.gl/T8SUGP

ఎవరి పండ్లు ఎవరు రాలగొడతారో.. బండ్ల గణేష్ నెంబర్ ఇదే- రోజా

http://telugu.asianetnews.com/entertainment/bandla-ganesh-roja-war-continues-in-social-media

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos