నెల్లూరులో అజ్ఞాతవాసి సృష్టించిన  వింత కథ ఇది.  పవన్ కల్యాణ్ ఫాన్స్ కూడ  పవన్ లాగే ఉంటారు. వాళ్ల రాజకీయ ధోరణి విచిత్రంగా ఉంటుంది.ఎవరినీ వదలుకోరు.

నెల్లూరు సీటి ఎమ్మెల్యే (వైసిపి)అనిల్ కుమార్ యాదవ్   గురించి తెలుసుకదా. ఆయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి వీరాభిమాని. వైసిపి లో ఉన్నా ఆయన పవన్ ను అభిమాని అని చెప్పుకునేందుకు ఎపుడూ జంకలేదు. అయితే, ఈ మధ్య పవన్ కి ఆయనకు విబేధాలొచ్చాయి. ఆ మధ్య పవన్ కల్యాణ్  ఆంధ్ర పర్యటనలో ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన వచ్చినపుడు ప్రతి పక్ష నేత  జగన్ పేరు తీసుకురావడం ఆయన నచ్చలేదు.  దీనితో  పవన్ టూర్ టిడిపి  స్పాన్సర్డ్ ప్రోగ్రాం అని, తాను ఇక పవన్ అభిమాని అని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని అన్నారు. 

అయితే, ఈరోజు ఆయన అనుచరులు ‘అజ్ఞాతవాసి’ పండగకోసం సిద్దమయ్యారు.  అజ్ఞాత వాసి కటౌట్లు ఊరంతా పెట్టారు. అంతేకాదు, కౌటట్ల మీద నినాదం ఏమిటో తెలుసా... 

‘పవన్ అభిమానిస్తాం, అనిల్ అన్నకు అండగా నిలుస్తాం’ అని ఫ్లెక్సీ బోర్డులు పెట్టారు. ఇది హాట్ టాపిక్ అయింది.  ఇది అనిల్ అభిమానులు సొంతంగా తీసుకున్న నిర్ణయమా లేక అనిల్ తనకు పవన్ మీద ఉన్న అభిమానం చంపుకోలేక  అనుచరులను అజ్ఞాతవాసి సంబరాలను పంపాడా?  ఇది నెల్లూరు లో జరుగుతున్న చర్చ.