Asianet News TeluguAsianet News Telugu

వైసిపి ఎమ్మెల్యే మీద కన్నేసిన పోలీసులు

మొత్తానికి నెల్లూరు జిల్లా పోలీసులు  వైసిపి ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని విచారణకు పిలిచారు. నిందితుడిగా పిలిచారా లేక సాక్షిగా పిలిచారా అనేది ఇపుడయితే తేలదు. మొత్తానికి నెల్లూరు జిల్లా వైసిపి మీద ప్రభుత్వం గురిపెట్టిందనిపిస్తుంది. తదుపరి వ్యక్తి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్.

YCP mla kotamreddy attends  inquiry in cricket betting  case

కృష్ణ‌సింగ్ పేరు ఎప్పుడైనా విన్నారా..?  ఆయ‌న‌తో మీకేమైనా ప‌రిచయం ఉందా..? ఉంటే ఎలాంటి ప‌రిచయం..?  మేయ‌ర్ ఎన్నిక‌ల స‌మ‌యంలో  గోవా క్యాంపు ఖ‌ర్చును మీ ద్వారా కృష్ణ‌సింగ్ పెట్టార‌ట నిజ‌మేనా..? బిర‌ద‌వోలు  శ్రీకాంత్ రెడ్డి, రూప్ కుమార్ యాద‌వ్ ద్వారా మీకు డ‌బ్బులు అందాయంట క‌దా అందులో నిజ‌మెంత..? బుకీ ఎల్ ఎస్ ఆర్ నుంచి మీకు చాలా కాల్స్ వచ్చాయట కదా..? క్రికెట్ బుకీల నుంచి ముడుపులు తీసుకున్నారా? బుకీ కృష్ణ సింగ్ ల్యాప్ టాప్ లో దొరికి ఈ అధారాల సంగతేంటి?

ఇవి ఈ రోజు నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎదురయిన ప్రశ్నలు. పోలీసు విచారణలో ఉన్న క్రికెట్ బెట్టింగ్ కేసులో శ్రీధర్ ను ఈ రోజు  జిల్లా అదనపు పోలీసు సూపరింటెండెంట్ శరత్ బాబు ప్రశించారు. శ్రీధర్ తో పాటు, సిటి వైసిపి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి కూడా నోటీసులందాయి.

విచారణ అనంతరం శ్రీధర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

క్రికెట్ బుకీల గురించి,పంటర్లగురించి తనను ప్రశ్నించారని,  వారితో తనకు ఉన్ సంబంధాల గురించి వాకబు చేశారని ఆయన చెప్పారు. ఎవరితో నూ తమకు సంబంధం లేదని చెబుతూ పోలీసులుకోరితే, తమ కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్ల వివరాలను కూడా అందించేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు.  మరొకసారి ఆగస్టు 27న విచారణకు రమ్మన్నారని అంటూ పోలీసులకు తాను అన్ని విధాల సహకరిస్తానని కూడా అన్నారు.

బుకీలతోను,బుకీగ్యాంగ్ లీడర్ కృష్ణ సింగ్ తో తనకు ఎలాంటి సంబంధంలేదని చెబుతున్నా నోటీసులు అందించారని చెబుతూ దీని వెనక ప్రభుత్వ పెద్దల  హస్తముందని అనుమానంగా ఉందని శ్రీధర్ రెడ్డి చెప్పారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios