ఇరవై నాలుగు గంటల్లో ఏంత మార్పో చూడండి... అమెనిన్న పొద్దున వైసిపి ఎమ్మెల్యే. ఈ రోజు టిడిపి ఎమ్మెల్యే. వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇది నిజం. వైసిసి పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీ ఫిరాయించాక ఈ రోజు తెలుగుదేశం సభ్యురాలుగా అసెంబ్లీకి హాజరయ్యారు. వైసిసి పిలుపు ప్రకారం ఆమె నిన్నటి దాకా అసెంబ్లీని బహిష్కరించారు.  అసెంబ్లీలో చేసేదేముంది, అక్కడ మాట్లాడనీయరు, మాట్లాడితే మైక్ కట్ చేస్తారు. ఫిరాయింపు దారులంతా రిజైన్ చేశేదాక నేను ప్రజల్లోకే పోతానని ప్రతిపక్ష నాయకుడు జగన్ అసెంబ్లీ బహిష్కరించి రాష్ట్రాటన బయలుదేరారు. అసెంబ్లీ బహిష్కరణపిలుపుకు ఈశ్వరి కూడా స్పందించారు. ఇపుడు పార్టీ మారాక ఆమె టిడిపి సభ్యురాలై పోయి అసెంబ్లీకి వచ్చారు.   అసెంబ్లీలో ఉన్న ఎకైన వైసిసి సభ్యురాలు ఆమెయే.  పార్టీ మారి,సీటు ట్రెజరీ బెంచెస్ వైపు మారినా, మె టెక్నికల్ గా వైసిపి ఎమ్మెల్యేయే. పార్టీ మారిన వైసిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఉప ఎన్నికల్లో నెగ్గాలని వైసిసి సభలో గొడవ చేసినపుడు ఈశ్వరి కూడా గొంతుకలిపి పార్టి ఫిరాయించిన వాళ్లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇపుడు తన డిమాండ్ మీద ఈ శ్వరి ఎలా స్పందిస్తారో చూడాలి.

వైసీపీనుంచి గిడ్డి ఈశ్వరి టిడిపిలోకి ఉడాయించాకా ప్రతిపక్ష  పార్టీ సభ్యుల సంఖ్య 45 కు పడిపోయింది.. గడిచిన మూడున్నరేళ్లలో ఆ పార్టీ నుంచి 22 మంది ఎమ్మెల్యే లు టీడీపీలో చేరిపోయారు. ఇపుడు ఇది 23 కు చేరిపోయింది.  వారిపై అనర్హత వేటు ఎసేంతవరకు తాము అసెంబ్లీకి సమావేశాలకు  హాజరుకాబోమని స్పీకర్ కు కూడా వైసిపి నేతలు తేల్చి చెప్పారు. గిడ్డి ఈశ్వరి ఇదంతా కాదంటారా. ఇదంతా మర్చిపోయి ఆమె సభలోఎలా కూర్చుంటారో ...