చిత్తూరు జిల్లా రామాపురంలోని డంపింగ్ యార్డును తొలగించాలని ధర్నాకు చేస్తున్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.తిరుపతి పట్టణం నుంచి తరలిస్తున్న చెత్తను సి.రామాపురం వద్ద డంపింగ్ చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా సి. రామాపురంలోని డంప్ యార్డును తొలగించాలని ధర్నా చేస్తున్న చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చెవిరెడ్డి నిరవధిక నిరసన తో ఆప్రాంతలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సి.రామాపురం గ్రామంలో 144 సెక్షన్ విధించారు. గత మూడు రోజులుగా రామాపురంలోని డంప్ యార్డును ఎత్తివేయాలని గ్రామస్తులతో కలిసి చెవిరెడ్డి రోడ్డుపైనే బైఠాయించి, నిరవధిక నిరసన తెలుపుతున్నారు.
శుక్రవారం పోలీసులు చెవిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు 50మంది వైఎస్ఆర్‑సీపీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు.
తిరుపతి పట్టణం నుంచి తరలిస్తున్న చెత్తను సి. రామాపురం వద్ద డంపింగ్ చేస్తున్నారు.
ఇలా చెత్తని జానవాసాలకు సమీపంలో డంపింగ్ చేస్తూ ఉండటంతో ఈప్రాంతవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆయన చెబుతున్నారు.
గ్రామస్తుల అభ్యంతరాన్ని అధికారులు పట్టించుకోలేదు. చివరకువారు వైసీపీ కార్యకర్తలతో కలిసి ధర్నా చేపట్టారు.
అయితే పోలీసులు ఎమ్మెల్యే చెవిరెడ్డితోపాటు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.
