తెలుగు నాట అభిమానులకు తమ  సినీ హీరో అరాధ్యుడు. ఆయనే వాళ్ల ప్రపంచం. తమ హీరోని ఎవరైన పెల్లెత్తు మాట అంటే సహించరు. హీరో అంటే పిచ్చి వాళ్లకి. తమ హీరో కోసం వాళ్లేమయినా చేస్తారు. ఇది దక్షిణాది స్పెషాలిటి. అందులో తెలుగోళ్ల  సూపర్ స్పెషలాటి. అభిమానులంటే, హీరోలకు అన్ అపాయింటెడ్ సైన్యం వంటి వాళ్లు అభిమానులు . అభిమానిని వాళ్లు మార్చుకోరు. అది మత మార్పిడంతా అపవిత్రంగా భావిస్తారు. ఇలాంటపుడు ఒక వీరాభిమాని తాను తన హీరో అభిమానిగా మానేస్తున్నానంటే... అది సంచలన ప్రకటనే.

ఇలాంటి ప్రకటన చేశారు నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ (వైసిపి).  ఆయన పవన్ కల్యాణ్ కి చాలా చాలా వీరాభిమాని. చాలా కంటే పద్ద విశేషణం తెలుగు లో ఉందేమోనాకుదొరకలేదు.తాను వేరే పార్టీ ఎమ్మెల్యే అయినా సరే , పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెటినా సరే, ఆయన విడుదలయిన ప్రతిసినిమాను చూడకుండా ఉండలేదు. అన్ని ఎఫ్ డి ఎఫ్ ఎస్ (FDFS)లే. ఆయన   పవన్ ఫెయిల్ అయిన  జానీని 9 సారు  చూశాడు. కాటమరాయుడిని వదల్లేదు. ప్రతిసినిమా ఎఫ్ డి ఎఫ్ ఎస్.

వైసిపిలో ఉంటూ పవన్ అభిమానించడమేమిటి? అంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరని ఆయన సమర్థించుకున్నారు.  ఈ వీరాభిమానం కారణంగా ఆ మధ్య ఆయన పార్టీ మారతారని,జనసేనలో చేరతారని కూడా రూమర్లు వచ్చాయి. ఎందుకంటే, చాలా మంది ఎమ్మెల్యేలు వైసిపి ని వదిలేస్తున్నందున, యాదవ్ కూడా పార్టీ ని వదిలేసి జనసేన లో చేరి పోతాడని చాలా మందిచెప్పారు. అలాంటి అనిల్ కుమార్ యాదవ్ ఇపుడు,  ’ సారీ, నేను పవన్ అభిమానిగా ఇక కొనసాగలేను. తప్పకుంటున్నాను,’ అని ప్రకటించేశారు.

ఇది సన్సేషనల్ ప్రకటన. అభిమానులు ఇనాక్టివ్ అయిపోతారు తప్ప, ఇలా మధ్యలో రిజైన్ చేయడం ఉండదు.

అందునా అనిల్ లాంటి వ్యక్తి ఈ ప్రకటన చేయడం చాలా చర్చనీయాంశమయింది రాజకీయ వర్గాల్లో.

అనిల్ కుమార్ యాదవ్ ఎందుకలా చేశాడో తెలుసా.. ఆయన మాటల్లోనే చూడండి.

‘‘పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారు. గత మూడు రోజుల  యాత్ర కేవలం వైసీపీని విమర్శించడానికే అన్నట్లు సాగింది. ప్రజలకోసం పని చేద్దామనే తాపత్రయం లేకపోవడం శోచనీయం. నేను పవన్ కు చాలా అభిమానినే. ఇందులో అనుమానం లేదు.   పవన్ చేస్తున్న రాజకీయాలు కుళ్లు రాజకీయాలనిపిస్తున్నది. అది  నచ్చకే మనసు చంపుకుని పవన్ కళ్యాణ్ ను అభిమానించడం మానేస్తున్నాను,’ అని బాధగా ప్రకటించారు.

 ‘ప్రతిసారి ఏదో ఒక యాత్ర పేరుతో టీడీపీకి అనుకూలంగా మాటాడుతున్నారు. కేవలం వైసిపిని తిట్టడం, టిడిపికి అనుకూలంగా మాట్లాడేందుకు యాత్ర లా?  ప్రెస్ మీట్ పెట్టి రోజు జగన్ ను తిట్టొచ్చు కదా,’ అని అన్నారు.

అంతేకాదు,  కులాల మీద  పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా అనిల్ తీవ్రంగా  ఖండించారు. ‘ పవన్ కు ఉన్నంత కులపిచ్చి ఈ రాష్ట్రంలోమా రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబునాయుడుకి కూడా లేదు. ఇది జగమెరిగిన సత్యం,’ అన్నారు.

‘వారసత్వంగా సీఎం కావాలనుకోవాలనుకోవడం తప్పని అంటారు. మరి మీరు మీ అన్నయ్య వారసత్వాన్ని ఎందుకు పుణికిపుచుకుని  హీరో అయ్యార కాదా,’ అని ప్రశ్నించారు.

ఇవన్నీ చూశాక, ఇక పవన్ ని అభిమానించడం కష్టమని భావిస్తున్నానని అన్నారు.