‘గాలేరు-నగిరి’ సాధనకు రోజా పాదయాత్ర

ycp mahila leader roja started 4 days padayatra
Highlights

  • పాదయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
  • నాలుగు రోజులు పాదయాత్ర చేయనున్న రోజా

గాలేరు-నగిరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మంగళవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగిరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగిరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయని చెప్పారు.

ప్రాజెక్టు కోసం చేపడుతున్న పాదయాత్ర నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమై తిరుమల వరకు సాగుతుందని వెల్లడించారు. డిసెంబరు 2వ తేదీ శ్రీవారిని దర్శించుకుని ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రార్థిస్తామన్నారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. పాదయాత్రలో పార్టీ నాయకులు భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు

 

loader