జగన్ పాదయాత్ర చేస్తానంటే.. టీడీపీ నేతలెందుకు భయపడుతున్నారు? అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
జగన్ పాదయాత్ర అంటే టీడీపీ భయపడుతోందా? ఉలిక్కిపడుతోందా.. నేతలకు చెమటలు పడుతున్నాయా? అవుననే అనిపిస్తోంది. అందుకే గత మూడు నాలుగు రోజుల నుంచి టీడీపీ నేతలు పాదయాత్ర విషయంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇదే విషయంపై వైసీపీ నేతలు మల్లాది విష్ణు,వెల్లంపల్లి శ్రీనివాస్ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ పాదయాత్ర చేస్తానంటే.. టీడీపీ నేతలెందుకు భయపడుతున్నారు? అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్ పాదయాత్ర మొదలౌతోందంటే.. టీడీపీ నేతల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వారు అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు డప్పులు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల దగ్గరకు జగన్ వెళ్తుంటే టీడీపీ నాయకులకు చెమటలు పడుతున్నాయన్నారు.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నిండా మునిగి హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడకు వచ్చారని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గంజాయి కేసులో ఫోన్ సంభాషణతో మాజీ మంత్రి శ్రీధర్ బాబుపై తెలంగాణలో కేసు నమోదు చేశారని..మరి, ‘ఓటుకు కోట్లు’ కేసులో పక్కాగా ఆధారాలున్నా చంద్రబాబుపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అంటూ ప్రశ్నించారు. పయ్యావులపై రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజం కాదా? రేవంత్ వ్యాఖ్యలపై చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన, అరాచక పరిస్థితులు, జన్మభూమి కమిటీలు చేస్తున్న అరాచకాలు, నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలు తదితర అంశాలపై జగన్ పాదయాత్ర ప్రస్తావిస్తారని చెప్పారు. ప్రజా సమస్యలు వదిలేసి.. ప్రధాన ప్రతిపక్ష నేతపై విమర్శలు చేస్తూ టీడీపీ నేతలు కాలం గడిపేస్తున్నారని ఆరోపించారు.
