యనమలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు యనమల నోటిని పినాయిల్ తో కడగాలన్న జోగి రమేష్
ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిపై వైసీపీ నేతలు ఫుల్ గా ఫైర్ అవుతున్నారు. తమ పార్టీ అధినేత జగన్ పై విమర్శలు చేస్తూ ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు. జగన్ పాదయాత్ర, అసెంబ్లీ బహిష్కరణ అంతా జగన్ ముందస్తు ఎత్తుగడ అంటూ యనమల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై శనివారం వైసీపీ నేత జోగి రమేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
యనమల నోటిని పినాయిల్ తో కడుక్కోవాలని జోగి రమేష్ సూచించారు. తమ పార్టీ ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకొని అసెంబ్లీ బహిష్కరించిందని చెప్పారు. చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక రాజకీయాలతో ఆనాడు ఎన్టీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే అనైతిక రాజకీయాలకు వ్యతిరేకంగా తామూ నడుస్తున్నామన్నారు.
దివంగత నేత ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడించింది టీడీపీ నేతలేనని జోగి మండిపడ్డారు. చంద్రబాబు వెనుకనుంచి పొడిస్తే.. యనమల రామకృష్ణుడు ముందునుంచి ఎన్టీఆర్‌ను పొడిచారని దుయ్యబట్టారు. స్పీకర్ కుర్చేకే యనమల ఆపాడే మచ్చతెచ్చారంటూ ఆరోపించారు.
