Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసింది వైసిపియే

ప్రపంచ బ్యాంకుకు తప్పుడు మెయిల్స్ పంపి అమరావతికి  రుణం రాకుండా ప్రతిపక్ష వైసిసి  అడ్డుకుంటూ ఉంది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు,కోర్టులలో పిటిషన్లు వేశారు,చివరికి రుణాలు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకే ఫిర్యాదులు పంపుతారు. రైతుల పేరుతో ఈ లేఖ లో ఉన్నది వైసిపియే.

 

yanamala accuses ycp of stalling world bank loan to Amaravati


 ప్రపంచ బ్యాంకుకు తప్పుడు మెయిల్స్ పంపి అమరావతికి  రుణం రాకుండా ప్రతిపక్ష వైసిసి  అడ్డుకుంటూ ఉందని ఆర్థిక మంత్రి యనమల మండిపడ్డారు. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్లారు,కోర్టులలో పిటిషన్లు వేశారు,చివరికి రుణాలు ఇవ్వవద్దని ప్రపంచ బ్యాంకుకే ఫిర్యాదులు పంపుతారా అని అమరావతిలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనలో కూడా ఇదేవిధంగా తప్పుడు మెయిల్స్ పంపి పెట్టుబడులను అడ్డుకోవాలని చూశారని ఆయన విమర్శించారు.


 రాజధాని శంకుస్థాపనకు రావద్దని విదేశీ మంత్రులకు కూడా ఇదేవిధంగా తప్పుడు మెయిల్స్ పంపారని కూడా ఆర్థిక మంత్రి అన్నారు.

 

యనమల ఇంకా ఏమన్నారంటే... 


 రాజధాని అమరావతి నిర్మాణ పనులకు అడ్డంకులు కల్పిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే రైతుల ముసుగులో ప్రపంచబ్యాంకుకు తప్పుడు ఫిర్యాదులు పంపడం దుర్మార్గ చర్య.


 అభివృద్దిని అడ్డుకునే అరాచక పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ దాపురించింది.


 ఒక రాజకీయ పార్టీగా ఉండటానికే వైకాపా కు అర్హతలేదు.


 రాజధాని నిర్మాణం జరిగితే మీకు పుట్టగతులు ఉండవని ఈవిధంగా తెగిస్తారా?


 పేర్లు లేకుండా ప్రపంచ బ్యాంకుకు రుణాలు ఇవ్వవద్దని ఈ మెయిల్స్ పంపడం వెనుక ఉన్నదెవరో బయటపడాలి.


 ఫిర్యాదులు పంపినవారు నిజంగా రైతులు అయితే పేర్లు బయట పెట్టవద్దని ప్రపంచబ్యాంకు తనిఖీల ప్యానల్ ను కోరుతారా?


 దానిని బట్టే వారు రైతులు కాదని, రైతుల ముసుగులో వైకాపా దొంగలే ఈ నీచానికి దిగజారారని తెలుస్తోంది.


 ఇప్పటికే కింది కోర్టునుంచి హైకోర్టు వరకు,గ్రీన్ ట్రిబ్యునల్ దాకా దాదాపు 16 పిటిషన్లు వేశారు.


 రూ.4,600కోట్ల ప్రాజెక్టు రాష్ట్రానికి రాకుండా అడ్డుకోవడం అనైతికం,అరాచకానికి పరాకాష్ట.


 పెట్టుబడులు రాకుండా చేయడానికి నానా పాట్లు పడుతున్నారు,ఉపాధి అవకాశాలను దెబ్బతీయాలని అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు.


 అధికారంలో ఉన్నప్పుడు అడ్డంగా దోచుకున్నారు, అధికారం పోగానే అభివృద్దికి అడ్డంకులు కల్పిస్తున్నారు. ఇంత అడ్డాల పార్టీని, అడ్డాల నాయకుడిని మూడు దశాబ్దాలలో చూడలేదు.


 రాష్ట్రానికి ఆదాయం రాకూడదు,ఉపాధి ఏర్పడకూడదు,అభివృద్ది చెందకూడదు,ఆంధ్రప్రదేశ్ అణగారిపోవాలి అనేదే ధ్యేయంగా వైఎస్సార్ కాంగ్రెస్ పనిచేస్తోంది.


 తప్పుడు విధానాలు, తప్పుడు పనులు, తప్పుడు పిర్యాదులు,తప్పుడు మెయిల్స్,తప్పుడు పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్.

Follow Us:
Download App:
  • android
  • ios