32 ఇంచెస్  స్మార్ట్ టీవీ రూ.13వేలే

First Published 7, Mar 2018, 5:04 PM IST
Xiaomis 32 inch Mi TV 4A Released today with Rs 13999  Pricing In India
Highlights
  • అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీ

చైనాకి చెందిన ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ షియోమి.. అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీని వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఇటీవల షియోమి ఎంఐ టీవీ4 పేరిట 55ఇంచెస్ టీవీని విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. భారత్ లో ఈ టీవీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో.. మరో రెండు స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

ఎంఐటీవీ 4ఏ పేరిట 32, 43 ఇంచెస్ వేరియంట్స్ లలో వీటిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 32 ఇంచెస్ టీవీ ధర రూ.13,999గానూ, 43 ఇంచెస్ టీవీ ధర రూ.22,999గానూ ప్రకటించింది.ఈ టీవీలు ఈ నెల 13వ తేదీ నుంచి ఎంఐ ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్ లలో కొనుగోలు చేసుకోవచ్చు.

ఇవే టీవీలు ఈ నెల 16వ తేదీ నుంచి ఎంఐ హోమ్ స్టోర్స్‌లోనూ లభ్యం కానున్నాయి. ప్రతి వారంలో రెండు సార్లు మంగళవారం, శుక్రవారాలలో ఈ టీవీలకు ఫ్లాష్ సేల్‌ను నిర్వహిస్తారు. ఇక ఈ టీవీ కొన్న జియోఫై వినియోగదారులకు రూ.2200 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. 

షియోమీ ఎంఐ టీవీ 4ఏ 32 ఇంచ్ మోడల్‌లో 32 ఇంచుల హెచ్‌డీ డిస్‌ప్లే, 1366 x 768 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ ఓఎస్, వైఫై, హెచ్‌డీఎంఐ, ఏవీ, యూఎస్‌బీ 2.0, ఈథర్‌నెట్, ఎస్/పీడీఐఎఫ్ పోర్టులు, డీటీఎస్ ఆడియో ఫీచర్లు ఉన్నాయి. 

loader